టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైనల్ గా మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నాడు. 100కోట్ల షేర్స్ అందుకునేందుకు మహేష్ 25వ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిదానంగా వెళుతోంది. మొన్నటివరకు కలెక్షన్స్ స్టడీగానే ఉన్నప్పటికీ ఇప్పుడు స్లోగా తగ్గినట్లు అనిపిస్తోంది. 

ఈ నెల 9న రిలీజైన ఈ సినిమా రీసెంట్ గా 90కోట్ల షేర్స్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది. నైజం ఏరియాలో మహేష్ మరోసారి తన బలాన్ని చూపించాడు. అత్యధికంగా ఇక్కడ 23కోట్ల షేర్స్ ను అందుకున్న మహర్షి నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. 

100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా హిట్ లిస్ట్ లో చేరాలంటే మినిమమ్  ఇంకో 20 కోట్ల షేర్స్ ను రాబట్టాలి. మరి  ఈ హాలిడేస్ లో మహర్షి ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి.  ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్(షేర్స్) ఈ విధంగా ఉన్నాయి. 

నైజాం - రూ. 23.50కోట్లు

సిడెడ్ - 8.09కోట్లు

గుంటూరు - రూ. 7.05కోట్లు

కృష్ణ - రూ 4.63కోట్లు

ఈస్ట్ - రూ 6.01కోట్లు

వెస్ట్ - రూ. 4.74కోట్లు

ఉత్తరాంధ్ర - రూ. 8.52కోట్లు

నెల్లూరు -  2.28కోట్లు

మొత్తం AP & తెలంగాణాలో 10 రోజుల కలెక్షన్స్: Rs 64.82 కోట్లు

కర్ణాటక - రూ. 9.22కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 2.55కోట్లు

ఓవర్సీస్ - రూ 11.80కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ గా 10-రోజుల కలెక్షన్స్: రూ 88.39 కోట్లు