మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 24కోట్ల షేర్స్ తో పరవాలేధనిపించింది. అయితే నాన్ బాహుబలి రికార్డ్స్ ను పలు ఏరియాల్లో బ్రేక్ చేసినప్పటికీ టోటల్ గా చూసుకుంటే మహేష్ సినిమా బాహుబలి 2 తరువాత తెలుగు రాష్ట్రాల్లో డే 1 లో అత్యధిక  షేర్స్ అందుకున్న చిత్రాల లిస్ట్ లో మహర్షి నాలుగవ స్థానంలోనే ఉంది. 

అరవింద సమేత (26.6కోట్లు)- అజ్ఞాతవాసి(26.36కోట్లు) - వినయ విధేయ రామ (26.03కోట్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మహర్షి తెలంగాణ ఆంధ్రలో కలిపి 24.6కోట్ల షేర్స్ ను అందుకుంది. 

ఏరియాల వారీగా  మొదటి రోజు మహర్షి అందుకున్న షేర్స్:

నైజం............... 6.38కోట్లు 

సీడెడ్.............. 2.89కోట్లు 

ఉత్తరాంధ్ర....... 2.88కోట్లు 

ఈస్ట్................. 3.2కోట్లు 

వెస్ట..................:2.47కోట్లు 

కృష్ణా................ 1.39కోట్లు 

గుంటూరు.......... 4.4కోట్లు 

నెల్లూరు............. 1 కోటి

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు టోటల్ షేర్స్: 24.6 కోట్లు