మహర్షి చిత్రం వసూళ్ల పరంగా మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కథని మహేష్ బాబుతోనే చేయాలని దాదాపు రెండేళ్ల పాటు ఎదురుచూశాడు. అందుకు తగ్గ ప్రతిఫలం దక్కిందనే చెప్పొచ్చు. సీడెడ్, యూఎస్ ఏరియాలలో మాత్రం మహర్షి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

వంశీ పైడిపల్లికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బావుంటాయని టాక్. అందుకే ఈ దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథని హీరోలకు చాలా స్పష్టంగా అర్థం అయ్యేలా నేరేట్ చేస్తాడట. తాను చదువుకున్న స్కూల్ దశ నుంచే తనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడ్డాయని వంశీ తెలిపాడు. చాలా మంది దర్శకుడు నార్త్ హీరోయిన్లకు కథని వివరించే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. కానీ వంశీ పైడిపల్లికి అలాంటి ఇబ్బంది లేదు. 

తనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ తో వంశీ పైడిపల్లి హీరోయిన్లతో క్లోజ్ గా మూవ్ అవుతుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైనప్పుడు వంశీ పైడిపల్లి సరదాగా స్పందించాడు. తన దర్శకత్వంలో పనిచేసిన హీరోయిన్లందరితో తనకు మంచి స్నేహం ఉందని తెలిపాడు. షూటింగ్ సమయంలో వారికి సన్నివేశాన్ని వివరించడం నా బాధ్యత అని వంశీ తెలిపాడు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే హీరోయిన్లతో స్నేహంగా ఉంటున్నాని తెలిపారు. 

ఇక తాను వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తుండడంపై వంశీ స్పందించాడు. చిన్న సినిమాలు చేసే టాలెంట్ తనకు లేదని అన్నాడు. తానెప్పుడూ తన సినిమాలు మంచి క్వాలిటీతో ఉండాలని భావిస్తానని అందుకే స్టార్ హీరోలతో చేస్తున్నాని వంశీ తెలిపాడు. ఫ్యామిలీతో వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత తన కొత్త చిత్రం గురించి వివరాలు వెల్లడిస్తానని వంశీ తెలిపాడు.