సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో రిలీజై బంపర్ హిట్ అందుకుంది. మహార్షి చిత్రం మహేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, పీవీపి, అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మహర్షి చిత్రం తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. మహర్షి చిత్రంలోని డీలిటెడ్ సన్నివేశాన్ని విడుదల చేశారు. ఈ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. నటుడు కమల్ కామరాజు ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించాడు. మహేష్, పూజా హెగ్డే వెళుతుండగా కమల్ కావాలనే కాలు అడ్డుపెడతాడు. 

దీనితో మహేష్ బాబు పూజాని క్లాస్ కి పంపించి అతడితో మాట్లాడడానికి కూర్చుంటాడు. రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, అమ్మాయితో తిరగ్గానే హీరో అనుకుంటున్నావా అని మహెష్ ని ప్రశ్నిస్తాడు. 'హీరో అనుకోవడం ఏంటి.. హీరోనే కదా' అని మహెష్ బదులిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిన్న ఫైట్ సన్నివేశం చోటుచేసుకుంటుంది.