Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో `మహాభారత్‌` ఫేమ్‌ సతీష్‌ కౌల్‌ కన్నుమూత

`మహాభారత్‌` ఫేమ్‌ సతీష్‌ కౌల్‌(74) కన్నుమూశారు. `మహాభారత్‌`లోని ఇంద్రుడి పాత్రలో సతీష్‌ కరోనా కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సతీష్‌ కౌల్‌ సిస్టర్‌ సత్య దేవీ ఈ విషయాన్ని పీటీఐకి వెల్లడించింది. 

mahabharat fame sathish kaul dies with corona  arj
Author
Hyderabad, First Published Apr 11, 2021, 11:43 AM IST

`మహాభారత్‌` ఫేమ్‌ సతీష్‌ కౌల్‌(74) కన్నుమూశారు. `మహాభారత్‌`లోని ఇంద్రుడి పాత్రలో సతీష్‌ కరోనా కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సతీష్‌ కౌల్‌ సిస్టర్‌ సత్య దేవీ ఈ విషయాన్ని పీటీఐకి వెల్లడించింది. జ్వరం రావడంతో గత గురువారం ఆయన ముంబయిలోని లుధియానాలో గల ఓ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరాక ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా, ఆయన ఆరోగ్యం మెరుగపడలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు` అని తెలిపింది. 

గతేడాది మేలో కరోనా లాక్‌డౌన్‌ వల్ల చిత్ర పరిశ్రమ మొత్తం ఆగిపోయింది. నిలిచిపోయింది. దీంతో పరిశ్రమని, కార్మికులను ఆదుకోవాలని సతీష్‌ కౌల్‌ ప్రభుత్వాలను విన్నవించారు. ప్రైమరీ నీడ్స్ ని ఫుల్‌ఫిల్‌ చేయాలని ఆయన కోరారు. తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయనకు కరోనా సోకడం, దాంతో కన్నుమూయడం బాధాకరం. సతీష్‌ కౌల్‌ మృతి పట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

సతీష్‌ కౌల్‌.. బీఆర్‌ చోప్రా రూపొందించిన `మహాభారత్‌` సీరియల్‌ 1988 నుంచి 1990 వరకు ప్రసారమయ్యింది. అప్పట్లో ఇది స్టార్‌ టీవీలో బాగా పాపులర్‌ అయ్యింది. దీనికి బీఆర్‌ చోప్రా దర్శకత్వం వహించారు. ఇందులో ఇంద్రుడి పాత్రలో సతీష్‌ కౌల్‌ నటించి మెప్పించారు. కాశ్మీర్‌ లో 1948 సెప్టెంబర్‌ 8న జన్మించిన సతీష్‌ కౌల్‌ పంజాబి సినిమాలతో కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలోకి అడుగుపెట్టారు. సీరియల్స్ తోపాటు బాలీవుడ్‌లో `ప్యార్‌ తో హోనా హై థా`, `ఆంటీ నెం.1`, `యారానా`, `ఈలాన్‌`, `ఖేల్‌`, `రామ్‌లఖన్‌`,`పాంచ్‌ ఫాలాడి`, `కమాండో`, `ఖూని మహల్‌`, `డాన్స్ డాన్స్`, `కర్మ`, `శివ కా ఇన్సాఫ్‌`, `భక్తి మెయిన్‌ శక్తి`, `వారంట్‌`, `దావత్‌` వంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios