Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు తీర్పు: లైకా సంస్థకు భారీగా జరిమానా.. నన్ను వేధించిన ఫలితమంటోన్న విశాల్‌

 ఈ కేసు విచారణ చేపట్టింది హైకోర్టు. అయితే లైకా వేసిన కేసులు, ఆరోపణలు అన్ని తప్పుడుగా కనిపిస్తున్నాయని కేసును కొట్టి వేసింది. అంతేకాకుండా.. లైకాకు ఐదు లక్షల జరిమానా విధించింది.

Madras High Court directs Lyca Productions to pay 5 lakh to vishal
Author
Chennai, First Published Aug 19, 2021, 8:01 AM IST

గత కొద్ది రోజులుగా తమిళ సినీ  పరిశ్రమలో కోర్టు విషయాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోలు ట్యాక్స్ చెల్లించే విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలు ఈ కేసులో కోర్టుకు వెళ్లి దెబ్బ తిన్నారు. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో సూర్య సైతం కోర్టు చేత అక్షింతలు వేయించుకున్నారు.ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాకు మాద్రాసు హైకొర్టు షాకిచ్చింది.

వివరాల్లోకి వెళితే...విశాల్ హీరోగా నటించిన చక్ర సినిమాపై.. నిర్మాతలపై.. హీరోపై లైకా ప్రొడక్షన్ సంస్థ కాపీ రైట్స్ ఆరోపణలు చేస్తూ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టోరీని ఆ మూవీ డైరెక్టర్ ముందుగా తమకు వినిపించారని..తమతోనే నిర్మిస్తానని డైరెక్టర్ అన్నారని… కానీ చివరకు ఆ సినిమాను విశాల్ నిర్మించాడని లైకా సంస్థ ఆరోపించింది. ఎట్టకేలకు ఈ కేసు విచారణ చేపట్టింది హైకోర్టు. అయితే లైకా వేసిన కేసులు, ఆరోపణలు అన్ని తప్పుడుగా కనిపిస్తున్నాయని కేసును కొట్టి వేసింది. అంతేకాకుండా.. లైకాకు ఐదు లక్షల జరిమానా విధించింది.

దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ.. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఎప్పుటికైనా నిజమే గెలుస్తుంది. కానీ ఈరోజు నిజమైంది. నాపై లైకా సంస్థ వేసిన కేసులు తప్పుడని న్యాయస్థానం నమ్మింది. అందుకే ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఇదంతా లైకా ప్రొడక్షన్స్ నన్ను మానసికంగా వేధించినందుకేనని అని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం విశాల్.. శరవణన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ లో  ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios