ఆమె శరీరం స్పందించలేని స్థితిలో ఉండటాన్ని గమనించి, వెంటనే ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ మీడియాకు తెలియచేసారు. 

ఫేమస్ పాప్ సింగర్ మడొన్నా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటోందనే వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఆరు పదుల వయసు దాటినప్పటికి తన అద్భుతమైన సంగీతంతో వరల్డ్‌ వైడ్‌గా అభిమానుల్ని సొంతం చేసుకున్న మడొన్నా ప్రస్తుతం ఐసీయూలో బెడ్‌పై ట్రీట్‌మెంట్ పొందుతోంది. వివరాల్లోకి వెళితే...

ప్రముఖ పాప్ సింగర్ సింగర్ మడొన్నా ఊహించని విధంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శరీరం స్పందించలేని స్థితిలో ఉండటాన్ని గమనించి, వెంటనే ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ మీడియాకు తెలియచేసారు. 

గత వారం రోజులుగా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా డిశ్చార్జ్ చేసారని మడొన్నా మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె శరీరం తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైందని చెప్పారు. ఆమెను ఐసీయూలోనే ఉంచి వైద్యులు చికిత్సను కొనసాగించారని తెలిపారు. మడొన్నా ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోందని చెప్పారు. 

View post on Instagram

ఈ క్రమంలో మడొన్నా అనారోగ్యానికి గురైన నేపథ్యంలో... ఆమె వరల్డ్ టూర్ తో పాటు ఇతర అన్ని కమిట్ మెంట్లను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు మేనేజర్ ప్రకటించారు. వరల్డ్ టూర్ తో పాటు ఇతర షోల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో మడొన్నాకు తోడుగా ఆమె కూతురు లియోన్ ఉన్నట్టు 'పేజ్ సిక్స్' పత్రిక తెలిపింది. 

మడోన్నా తన మ్యూజిక్ కెరీర్ నలభైవ వార్షికోత్సవ సందర్బంగా ఈ సంవత్సరం ప్రారంభంలో 'సెలబ్రేషన్' పర్యటనను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తన గానంతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ఈ పర్యటనను జూలై 15న వాంకోవర్‌లో ప్రారంభమై US, యూరప్‌కు వెళ్లే ముందు డిసెంబర్ 1న ఆమ్‌స్టర్‌డామ్‌లో ముగుస్తుందని ఆమె గతంలో తెలిపింది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు బాధపడుతూ... త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు.