హిందువులు దైవంగా ఆరాధించే రాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సినీ-రాజకీయ ప్రముఖులు అయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామీ కూడా కత్తి మహేష్ పై మండిపడ్డారు. తాజాగా నటి మాధవీలత కూడా కత్తిపై ఫైర్ అయింది. వ్యక్తిగతంగా కూడా ఆయనపై విమర్శలు గుప్పించింది.

'కత్తి మహేష్ నిన్ను నేను చెప్పుతో కొడతా' అని హెచ్చరించింది కూడా. ఇంకేం కామెంట్స్ చేసిందంటే.. 'సీతమ్మ రావణుడితో ఉంటే సంతోషంగా ఉండేదని చెప్పడానికి నీకేం అర్హత ఉంది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర మతాల వారిపై చేసి ఉంటే పరిణామాలు మరోరకంగా ఉండేవి. హిందూ మతంలో ఉండే స్వేచ్చను అడ్డం పెట్టుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్.. రామాయణం ఒక కథ అని నీకు అనిపిస్తే.. సైలెంట్ గా ఉండాలి అంతేకానీ ఇలా బహిరంగంగా ఏది మాట్లాడితే అది మాట్లాడకూడదు' అంటూ కామెంట్ చేసిన మాధవీలత.. కత్తి మహేష్ పెట్టే టార్చర్ భరించలేకే అతడి భార్య వదిలేసి వెళ్ళిపోయిందని.. మహిళల పట్ల అతడి అసలు మర్యాదే ఉండదని అన్నారు. అతడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడనే కారణంతోనే అతడి భార్య కనీసం విడాకులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు.