Asianet News TeluguAsianet News Telugu

రేపిస్ట్ రాజు సూసైడ్ పై మాధవి లత షాకింగ్ పోస్ట్‌.. ఏకేస్తున్న జనం

మాధవీలత పెట్టే పోస్టులు ఇష్టం లేని వాళ్లు ఆమెని అదే రేంజులో ట్రోల్ చేస్తూ ఆమెను కించపరిచే ప్రయత్నం చేస్తూండటం కూడా కామన్ అయ్యిపోయింది.  తాజాగా ఆమె రేపిస్ట్ రాజు ఆత్మహత్య విషయమై పోస్ట్ పెట్టారు.

Madhavi latha reaction on Raju Suicide
Author
Hyderabad, First Published Sep 16, 2021, 4:44 PM IST

సినిమాలకు బై చెప్పి చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీంది మాధవీలత. బీజేపి మహిళా నాయకురాలిగా సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూంటుంది మాధవీలత. ఆ క్రమంలో సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూంటుంది. అయితే, మాధవీలత పెట్టే పోస్టులు ఇష్టం లేని వాళ్లు ఆమెని అదే రేంజులో ట్రోల్ చేస్తూ ఆమెను కించపరిచే ప్రయత్నం చేస్తూండటం కూడా కామన్ అయ్యిపోయింది.  తాజాగా ఆమె రేపిస్ట్ రాజు ఆత్మహత్య విషయమై పోస్ట్ పెట్టారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా చనిపోయింది రాజు అని నిర్ధారించారు అధికారులు. మంత్రి కేటీఆర్ కూడా రాజు చనిపోయినట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
 
అయితేమాధవీలత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ.. ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించి పోలీసులు ప్రభుత్వం జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత.

రేపిస్ట్ చనిపోయాడు అనేది నేను నమ్మను. పచ్చబొట్టు ఒకటే ఆధారం కాదు.. అతని భార్యని పిలిచి అతని శరీరాన్ని మొత్తం చూసి ఆమె చెప్పాలి.. చనిపోయింది నా భర్తే అని. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇది ప్రభుత్వం ఆడుతున్న డ్రామా. రాజు అనేవాడు చచ్చాడు అంటే నేను నమ్మలేను. గవర్నమెంట్, పోలీసులు ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తున్నారు’ అంటూ ఫైర్ అయ్యింది మాధవీలత.

అయితే ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ రాస్తూ...ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు.. ఎప్పటిలాగే మాధవీలత మిడిమిడి జ్ఞానంతో పోస్ట్‌లు పెడుతుందని అంటున్నారు. మరొక వ్యక్తి అయితే... మీరు అర్జెంట్‌గా ఎర్రగడ్డకి ఫిష్ట్ అవ్వండి. కొద్దిగా అయిన బుర్రలో సరుకు ఉంటే ఇట్లా మాట్లాడవు మాధవీ.. పచ్చబొట్టు వేస్తే గాయం మానడానికి కనీసం వారం పడుతుంది అని నీ బత్తాయి బుర్రకు తెల్వదు.. అయినా ఇలాంటి వాటిని కారణం నీలాంటి బత్తాయి ఉన్మాదులే.. సర్లే నువ్ నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత.. బత్తాయి తొక్కని తీసినట్టు నిన్ను పార్టీనే తీసి పక్కన పెట్టింది.. బయటకు వచ్చి మాట్లాడు.. ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్ట్‌లు పెట్టకు’ అన్నారు.

మరో ప్రక్క చనిపోయిన  రాజుది ఆత్మహత్య కాదని.. పోలీసులే చిత్ర హింసలకు గురిచేసి చంపేశారంటూ అతని భార్య మౌనిక ఆరోపిస్తోంది. తన భర్త మంచివాడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని తెలిపిన ఆమె.. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఇక చిన్నారి కాలనీ వాసులు కూడా రాజు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసుని క్లోజ్ చేయడానికి చనిపోయిన వ్యక్తిని రాజుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios