ఏపీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన నటి, బీజేపీ అభ్యర్ధి మాధవీలత ఓడిపోయారు. అయితే ఓటమి తనను బాధించలేదని, ఇలా జరుగుతుంది ముందే తెలుసునని తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది.

''నేను ఓడిపోతా అని నాకు తెలుసు.. పార్టీ కి తెల్సు.. మీకు తెల్సు.. ముందుగానే తెల్సుకొని బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. మొదటి నుండి చెప్పాను.. ఎక్కడ కూడా నేను గెలుస్తాను అనే మాట వాడలేదు. మోడీ మళ్ళీ రావాలి అనే కోరుకున్న వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డురంగా ఉంది. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము మాకు నిజాయితీ పరులు వొద్దు అని బలే చెప్పారుగా..'' అంటూ జనాలపై పంచ్ వేసింది.

పవన్ కళ్యాణ్ ఓటమిని భరించలేకపోతున్నానని, అభిమానులు ఏమయ్యారు..? ఎన్ని మాటలు చెప్పారు ఇదేనా మీ ప్రేమ..? అంటూ ప్రశ్నించింది. 

''చదువుకున్న వారు రాజకీయంలోకి రావాలి అనేది మీరే..జేడీ లక్ష్మి నారాయణ గారు వచ్చారు? ఎందుకు ఓడించారు? విద్యార్థులు ఏమయ్యారు? మీ ఓట్లు ఏమయ్యాయి..?డబ్బు కులం కావాలి అని నిరూపించారుగా.. చదువు నీతి వొద్దు అని చెప్పేసారుగా?'' అంటూ యంగ్ స్టర్స్ కి కౌంటర్ ఇచ్చింది.