మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కొంతకాలం పాటు వరసగా వెండితెరపై హీరోయిన్‌గా ప్రయత్నించింది. అయితే ఒక్క హిట్టూ ఆమెకు దక్కలేదు. వరస పరాజయాలు మూటగట్టుకున్న ఆమె ఇక వెండితెరకు బై చెప్పేసి మళ్లీ తనకు గుర్తింపు తెచ్చిన వెబ్ మీడియా వైపుకు ప్రయాణం పెట్టుకుంది.

చాలా గ్యాప్ తర్వాత  'మ్యాడ్ హౌస్' అనే పేరుతో వెబ్ సిరీస్ తీసుకొస్తోంది.   100 ఎపిసోడ్స్‌తో కూడిన వెబ్‌ సిరీస్‌ ఇది.  ఈ వెబ్ సీరిస్ ఏడాదిన్నర పాటు సాగుతుందట.  ఈ మేరకు నిహారిక ఓ వీడియో విడుదల చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది.

ఇక ఈ సీరిస్ ని మహేష్ ఉప్పాల డైరక్ట్ చేయనున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణమయ్యే ఈ సిట్ కామ్ సీరిస్ ఫస్ట్ ఎపిసోడ్ త్వరలోనే అప్ లోడ్ చేయనున్నారు. ఈ సిట్ కామ్ కామెడీలో నలుగురు మిలియనీర్స్ చుట్టూ తిరుగుతుందని, వారు మధ్య జరిగే ఫన్నీ సంఘటనలే ఈ ఎపిసోడ్ లో మనని నవ్విస్తాయని అంటోంది.

ప్రస్తుతం నీహారిక... చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తోంది. అయితే చాలా చిన్న పాత్ర , అయినా సినిమాపై పైనే చాలా ఆశలు పెట్టుకుంది నిహారిక.గతంలో   ఆమె "ముద్దు పప్పు ఆవకాయ" అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇపుడు మళ్లీ అదే రూట్‌లోకి రావటంతో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.