దేశంలో బర్నింగ్ టాపిక్ గా ఉన్న శుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసుపై మంచువారి అమ్మాయి లక్ష్మీ స్పందించారు. ఆమె అనూహ్యంగా సుశాంత్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తికి మద్దతు తెలిపారు. మీడియా ఆమెను కార్నర్ చేయడంతో పాటు, చెడ్డదానిగా చిత్రీకరిస్తుందని చెప్పారు. మంచు లక్ష్మీ అభిప్రాయానికి కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు, కొందరు తప్పుబడుతున్నారు. మంచు లక్ష్మీ ఓ  సుధీర్గ సందేశం ట్విటర్ లో పోస్ట్ చేశారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చావుకు రియా చక్రవర్తి కారణం అంటూ ఆయన కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు అకౌంట్ నుండి భారీగా ఆర్థిక వ్యవహారాలు నడిచాయని తెలుసుకున్న ఈడీ అధికారులు ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. ఇక సీబీఐ  ఎంట్రీతో ఈ కేసులో మరిన్ని కోణాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఈ కేసుపై ఆసక్తి నెలకొని ఉన్న వేళ మీడియా ఫోకస్ మొత్తం ఈ కేసుపైనే ఉంది. 

ఈ నేపథ్యంలో మీడియాకు రియా చక్రవర్తి టార్గెట్ గా మారింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యుల ప్రతి కదలికను గమనిస్తూ వెంటపడుతున్నారు. అలాగే ప్రతి రోజూ అనేక కథనాలు రాయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తిని ఈ స్థాయిలో హింసించడం సరికాదని మంచు లక్ష్మీ అంటున్నారు. నిజానిజాలు బయటికి వచ్చే వరకు ఆమెను టార్గెట్ చేయడం ఆపేయాలి అన్నారు. మీడియా కథనాల వలన రియా కుటుంబ సభ్యులు ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నారు అన్నారు. మీడియా రియాను కార్నర్ చేసి, రాక్షసిగా చిత్రీకరిస్తుందని అన్నారు. ఈ కేసులో లక్ష్మీ తన పూర్తి మద్దతు రియాకు తెలుపగా నెటిజెన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తుంది.