కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఏ సినిమా చేసినా కూడా అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుంది. ఇక నెక్స్ట్ మారి2 సినిమాతో ఈ హీరో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఇక ఫైనల్ గా నేడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

సినిమాలో ధనుష్ కి సాయి పల్లవి గట్టిపోటీని ఇచ్చిందని చెప్పవచ్చు. మాస్ క్యారెక్టర్ లో ఉన్న ధనుష్ ని ఆమె ఆటపట్టించిన తీరు ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో వీరి కాంబినేషన్ ఊహించని విధంగా అందరిని మాస్ లుక్ లో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.  ధనుష్ చెప్పిన‘‘ఇఫ్ యు ఆర్ బ్యాడ్. ఐయామ్ యువర్ డాడ్’’ అనే డైలాగ్ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. 

అలాగే ధనుష్ సిక్స్ ప్యాక్ కూడా సినిమాలో హైలెట్ గా నిలవనుందని ట్రైలర్ ఎండింగ్ లో ఒక హింట్ ఇచ్చారు. అయితే మొదటి పార్ట్ లో ఉన్నట్టుగానే ఈ సీక్వెల్ లో కూడా ధనుష్ అదే లుక్ లో కనిపిస్తున్నాడు. ఫన్ అండ్ యాక్షన్ ఎంటరైనర్ గా సాగె ఈ సినిమాకు బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు. 

మారి పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ ఇప్పుడు మారికి సీక్వెల్ రావడం గమనార్హం. అయినప్పటికీ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ధనుష్ సొంత ప్రొడక్షన్ లో సినిమాను నిర్మించడం మరో ప్లస్ పాయింట్. ఈ నెల 21న సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.