సౌత్‌ ఇండస్ట్రీలో లైంగిక వేదింపుల ఆరోపణలు కామన్‌ అయిపోయాయి. ఇప్పటికే శ్రీరెడ్డి, చిన్మయి లాంటి వారు ఈ ఆరోపణల నేపథ్యంలో సంచలనాలు సృష్టించగా తాజాగా మరో సంచలన వార్త సినీ రంగాన్ని షేక్‌ చేస్తోంది. మలయాళ నటి మాల పార్వతి తన కుమారుడిపై లైంగిక వేదింపుల ఆరోపణలు రావటంతో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాల పార్వతి కుమారుడు అనంత కృష్ణన్‌ ట్రాన్స్‌జెండర్ అయిన మేకప్‌ ఆర్టిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి పార్వతి కుమారుడు అనంత్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అభ్యంతరకర ఫోటోలు పంపిస్తున్నాడని మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌ సోషల్ మీడియా వేదిక అభిమానులకు తెలియజేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో మాల పార్వతి స్పందించింది.

స్వయంగా సీమాకు ఫోన్‌ చేసి క్షమాపణలు కోరిన ఆమె తన కుమారుడి  మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నారు పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్ తో తనకి ఎన్నో సంవత్సరాల  స్నేహం ఉందని నా కుమారుడు అనంత్ చెప్పాడు. సీమ అంగీకారం లేకుండా తనతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నాడు.

అయితే ఈ విషయంలో నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికీ కేసు నమోదు చేశాను అలాగే అనంత్ సెల్ ఫోన్ ని పోలీసులకు అప్పగించాను. నేను సీమకే సపోర్ట్ చేస్తున్నా అలా అని నా కుమారుడ్ని తప్పుగా చూడడం లేదు. ఒకవేళ నా కొడుకు తప్పుచేస్తే శిక్ష అనుభవించక తప్పదు.' అని ఆమె అన్నారు తెలిపారు.
అయితే మాల పార్వతీ తన కుమారుడికి మద్ధతుగా మాట్లాడటంపై సీమా వినీత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.