మంచు విష్ణు మా అధ్యక్షుడిగా పదవి చేపట్టి ఏడు నెలలు అవుతుండగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. AIG హాస్పిటల్స్ నేతృత్వంలో సినీ కార్మికుల కోసం హెల్త్ క్యాంపు నిర్వహించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మంచు విష్ణు మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తామన్నారు. మా ఎన్నికల్లో మా బిల్డింగ్ నిర్మాణం ప్రధాన అజెండాగా ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమమే ఆయన ప్రధాన కర్తవ్యం అంటూ తెలియజేశారు. దీనిలో భాగంగానే హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఇక తనపై వచ్చిన కొన్ని ఆరోపణలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
సినిమా టికెట్స్ ధరల విషయంలో మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కలగజేసుకోలేదని తనని కొందరు విమర్శించారని మంచు విష్ణు కొంత అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు టికెట్స్ ధరలు పెంపు మంచిది అన్నవారు, ఇప్పుడు అధిక ధరల కారణంగానే వసూళ్లు పడిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాల సహకారం పరిశ్రమకు ఉంది. కాబట్టి ధరల పెంపు ఎటువంటి చిత్రాలకు అవసరం అనేది పరిశ్రమ చర్చించుకోవాలి అన్నారు. టికెట్స్ ధరలు పెంచడం మాత్రాన పరిశ్రమ బాగుపడుతుందనేది వాస్తవం కాదని పరోక్షంగా తెలియజేశారు.
ఏపీలో టికెట్స్ ధరలు తగ్గిస్తూ జీవో నంబర్ 35 జారీ చేయడం వివాదాస్పదమైంది. అంత తక్కువ ధరలతో పరిశ్రమ మనుగడ సాధ్యం కాదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్ద వివాదం నడిచింది. ఈ సమయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడరా? పరిశ్రమ సమస్య మా అధ్యక్షుడు పరిధిలోకి రాదా? అంటూ కొందరు విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని మంచు విష్ణు తాజాగా ప్రస్తావించారు. అలాగే ఆయన మా బిల్డింగ్ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఇంకా మాట్లాడుతూ.. మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు..సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో 'మా' కు సేవలందించారు..డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వారు. ఈ క్యాంపు కారణంగా మా సభ్యులందరు బెనిఫిట్ పొందుతున్నారు.. అన్నారు.
అనంతరం మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ... మంచు విష్ణు అధ్యక్షుడైన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ గా హెల్త్ కి ఇవ్వడం సంతోషంగా ఉంది. సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు . ఆరోగ్యం ఉంటే అవకాశాలు వస్తాయి AIG హాస్పిటల్ వారు 'మా' కు చేస్తున్న సహకారం మరువలేనిది. AIG హాస్పిటల్ కి ఇంటర్ నేషనల్ లెవెల్ లో చికిత్స కోసం వస్తున్నారు. AIG హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మంచు విష్ణు ఆధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంపు జరుగుతుంది. ఇప్పుడు ఉన్న 'మా' టీమ్ పర్ఫెక్ట్ అన్నారు.
నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ: విష్ణు నరేష్ లు నాకు ఫ్రెండ్స్ మూవీ ఆర్టిస్ట్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. కరోనా టైం లో కూడా రిస్క్ చేసి సినిమాలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ లకు ప్రివెంట్ హెల్త్ చెకప్ చాలా అవసరం.వరల్డ్స్ బెస్ట్ 50 హాస్పిటల్స్ లో ప్రివెంట్ హెల్త్ కోసం ఏమి చేస్తారో ఆ ఈక్విప్ మెంట్ ను ఈ హాస్పిటల్ లో ఉంది ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నేషనల్ ఇంటర్ నేషనల్ లెవెల్ లో మంచి పేరు వచ్చింది అన్నారు.
