Asianet News TeluguAsianet News Telugu

నరేష్ అహంకారి, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ పై కామెంట్స్ తో దాడి చేస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్న నరేష్ తో పాటు, ఆ ప్యానెల్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు నరేష్ పై ఆయన ఫైర్ కావడం జరిగింది. 

maa elections prakash raj sensation comments on naresh and manchu vishnu panel
Author
Hyderabad, First Published Oct 4, 2021, 11:21 AM IST

మరో వారం రోజులలో మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థుల మధ్య మాట యుద్ధం మొదలైంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ పై కామెంట్స్ తో దాడి చేస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్న నరేష్ తో పాటు, ఆ ప్యానెల్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు నరేష్ పై ఆయన ఫైర్ కావడం జరిగింది. 

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..  'పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తాపై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి. దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్‌కు  తాళం పడేది. 

సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసు.నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారు.నన్ను తెలుగువాడు కాదని నరేష్‌ అన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. మా అసోసియేషన్ కోసం ఒక బాధ్యత పనిచేయాలని వచ్చాను.

మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంది. చాలా బాధతో, ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నాం. మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదంటూ మంచు విష్ణుకు పరోక్షంగా ఆయన కౌంటర్‌ వేశారు.

తాను మా ఎన్నికల గురించి ప్రశ్నించినందుకు తనను బెదిరించారని ఆయన చెప్పారు. తాను ఒక లేఖ రాస్తే మా అసోసియేషన్ కు తాళం పడేదని చెప్పారు. తాను సౌమ్యంగానే మాట్లాడుతున్నానని, సౌమ్యంగానే కాదు కోపంగా కూడా మాట్లాడడం తనకు తెలుసునని ఆయన అననారు 

ఎన్నికల్లోకి వైఎస్ జగన్ ను, కేసీఆర్ ను, బిజెపిని లాగుతారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ బంధువైతే మా ఎన్నికలకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు రెండు సార్లు హలో చెప్పినంత మాత్రాన కేటీఆర్ మిత్రుడైపోతారా అని కూడా అడిగారు. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానెల్ కొట్టుకుపోతుందని ఆయన అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios