మాస్ బీట్ తో 'మా బావ మనోభావాలు' సాంగ్.. అఖండ స్టైల్ లో బాలయ్య స్టెప్పులు
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐటెం సాంగ్ ని ఈ చిత్రం నుంచి రిలీజ్ చేశారు. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే ఈ పాటపై బాగా హైప్ నెలకొంది.తాజాగా విడుదలైన లిరికల్ వీడియో బాలయ్య ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా ఉంది. సంగీత దర్శకుడు తమన్ థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగా మాస్ బీట్ ఇచ్చారు.
సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి ఐటెం సాంగ్ కి తగ్గట్లుగా ఆ తరహా లిరిక్స్ ఇచ్చారు. ఇక లిరికల్ వీడియోలో అసలైన హైలైట్ ఏంటంటే.. బాలయ్య డ్యాన్స్ అని చెప్పొచ్చు. అఖండ చిత్రంలో షర్ట్ విప్పుతూ చేసిన డ్యాన్స్ తరహాలో.. ఈ సాంగ్ లో కూడా కొన్ని మూమెంట్స్ ఉన్నాయ్. అలాగే గోళీసోడా బండికి వెల్లకిలా ఆనుకుని చేస్తున్న స్టెప్ కూడా బావుంది.
ఈ సాంగ్ లో చంద్రిక రవి, హనీ రోజ్ హాట్ హాట్ అందాలతో మెరిశారు. మొత్తంగా వీరసింహారెడ్డి చిత్రం నుంచి వచ్చిన ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే అని చెప్పొచ్చు. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరసింహారెడ్డి చివరి సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జనవరి 12న బ్లాస్టింగ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయినట్లే.