మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న నరేష్ ప్యానెల్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న నరేష్ ప్యానెల్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నరేష్ చర్యలు కొందరిని బాధ పెట్టాయి. ఆయన తన స్పీచ్ లో 'నా' అనే పదాలు వాడడంపై రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అలానే నటి హేమని స్టేజ్ పై అందరి ముందు అవమానించారు నరేష్. ప్రమాణ స్వీకారంలో భాగంగా ఉపాధ్యక్షురాలు నటి హేమ మాట్లాడుతుండగా.. అధ్యక్షుడు నరేష్ మైక్ లాగేసుకున్నారు. దీంతో ఆమె ఖంగుతింది.

అసలేం జరుగుతోందంటూ మండిపడింది. ఇంతలో జీవిత, రాజశేఖర్ లు కలుగజేసుకొని హేమకి మైక్ అందజేశారు. మైక్ తీసుకున్న హేమ.. నరేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నరేష్ గారు మైక్ తీసుకోవడం బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆయన స్టేజ్ పై చెప్పిన మాటలు తమతో ముందుగా చర్చించలేదని, జనరల్ బాడీ మీటింగ్ లో కూర్చొని మాట్లాడిన తరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు నరేష్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…