గత ఏడాది స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన బ్యానర్ లో కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని విడుదల చేశారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి వచ్చిన స్పందనతో తమిళ, మలయాళీ భాషల్లో కూడా రీమేక్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.  ఈ నేపథ్యంలో నిర్మాత ఎమ్ రాజశేఖర్ రెడ్డి 'కేరాఫ్ కంచరపాలెం' చిత్ర తమిళ, మలయాళీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. 

భారీ ధర వెచ్చించి ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం రోజు తన పుట్టిన రోజు కావడంతో ఈ చిత్ర ప్రకటన చేస్తున్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ మూవీ కేరాఫ్ కంచరపాలెం అని ఆయన తెలిపారు. సినిమా చూడగానే వెంటనే సురేష్ బాబు దగ్గరకు వెళ్లి రీమేక్ హక్కుల గురించి అడిగానని అన్నారు. 

తమిళ, మలయాళీ భాషల్లో ప్రస్తుతం ఈ చిత్ర రీమేక్ కోసం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించినట్లు రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కేరాఫ్ కంచరపాలెం రీమేక్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.