Asianet News TeluguAsianet News Telugu

సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ కన్నుమూత!

సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం నాడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆయన వారం రోజుల నుండి స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కన్నుమూశారు. 

lyricist vedavyasa rangabhattar passed away
Author
Hyderabad, First Published Feb 21, 2019, 9:38 AM IST

సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం నాడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆయన వారం రోజుల నుండి స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కన్నుమూశారు.

ఈరోజు బైరాగిపట్టెడలోని ఆయన స్వగృహం నుండి అంత్యక్రియలు  నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1946లో జన్మించిన వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో ఆయన జన్మించారు.

1968లో టీటీడీలో ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేశారు. 1986లో తొలిసారి ఆయన 'రంగవల్లి' చిత్రానికి పాటలు రచించారు. ఆ తరువాత 'శ్రీమంజునాథ', 'రామదాసు', 'పాండురంగడు', 'షిరిడీ సాయి', 'అనగనగా ఒక ధీరుడు', 'ఝుమ్మంది నాదం', 'ఓం నమో వెంకటేశాయ' ఇలా దాదాపు పదమూడు చిత్రాలకు సాహిత్యం అందించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios