Asianet News TeluguAsianet News Telugu

'సారంగ దరియా' సాంగ్‌కి అర్థం చెప్పిన సుద్దాల అశోక్ తేజ

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ‘సారంగదరియా’అంటూ సాగుతున్న పాట లిరికల్‌ వీడియోను రీసెంట్ గా నటి సమంత విడుదల చేశారు. సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ ఇచ్చారు. ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేటంత అద్బుతంగా ఉంది.  పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట విన్నవాళ్లు స్టెప్పులు వేసేంత ఊపు వస్తోంది. ఈ పాట వైరల్ అయిన తర్వాత చాలా మందికి కలుగుతున్న సందేహం..సారంగ దరియా అంటే అర్థం ఏమిటి ? ఆ పాటకు ఉన్న అర్థం ఏంటి ? 

lyricist Suddala Ashok teja explains meaning of Saranga Dariya jsp
Author
Hyderabad, First Published Mar 6, 2021, 11:34 AM IST

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ‘సారంగదరియా’అంటూ సాగుతున్న పాట లిరికల్‌ వీడియోను రీసెంట్ గా నటి సమంత విడుదల చేశారు. సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ ఇచ్చారు. ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేటంత అద్బుతంగా ఉంది.  పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట విన్నవాళ్లు స్టెప్పులు వేసేంత ఊపు వస్తోంది. ఈ పాట వైరల్ అయిన తర్వాత చాలా మందికి కలుగుతున్న సందేహం..సారంగ దరియా అంటే అర్థం ఏమిటి ? ఆ పాటకు ఉన్న అర్థం ఏంటి ? 

తెలంగాణ బాషపై, తెలంగాణ యాస, మాండలికంపై పట్టున్న వారిలో కూడా కొంతమందికి ఈ పదాలకు అర్థం ఏంటో అంతు చిక్కలేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సారంగ దరియా పాటకి వచ్చిన స్పందన చూసి ఆ గేయాన్ని రాసిన ప్రముఖ రచయిత, నేషనల్ అవార్డ్ గ్రహీత అయిన సుద్దాల అశోక్ తేజ తాను రాసిన ఆ పదాల వెనుకున్న అర్ధాన్ని, అంతరార్ధాన్ని వివరించే ప్రయత్నం చేసారు. ఇందుకోసం మీడియా కు ఇంటర్వూ ఇచ్చారు.

అశోక్ తేజ చెప్పిన దాని ప్రకారం...ఆదిలాబాద్ జిల్లాలో గోండులు వాయించే ఓ వాయిద్యం పేరే ఈ సారంగి.  వేణును ధరించినవాడు వేణుధరుడు అయినట్టుగానే సారంగిని ధరించినటువంటి యువతిని ముద్దుగా సారంగ దరియా అని వర్ణించినట్టు తెలిపారు. అంతేకాకుండా సారంగి దరియా సాంగ్ లో అటువంటి పదాలెన్నింటికో ఆయన అర్థాలను వివరించారు.  

ఇక శేఖర్ కమ్ముల  శైలి గురించి ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ కుటుంబాలు అందులోని సున్నిత ఉద్వేగాలు. మధ్యలో అమ్మాయి అబ్బాయి లవ్, కెరీర్, బరువు బాధ్యతలు కష్టాలు ఇష్టాలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇంతకుముందు ఫిదా చిత్రంలో సాయి పల్లవి పాత్రకు తెలంగాణా యాసను జోడించి మ్యాజిక్ చేసారు కమ్ముల. ఇప్పుడు అదే మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తూ సాయి పల్లవి పాత్రను డిజైన్ చేశారు. 

రేవంత్‌ పాత్రలో చైతు, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయిన సినిమా ఇది. ఇప్పటికే టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రాలు చూస్తే ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యపీడేస్, ఫిదా సినిమాలతో ఎందరో నటీనటులను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు.

చైతు , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు  రానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios