ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బయోపిక్ లా కాంట్రవర్సీలు తెగ వైరల్ అవుతున్నాయి. వర్మ కు కౌంటర్ గా చంద్రోదయం చిత్ర యూనిట్ ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బయోపిక్ లా కాంట్రవర్సీలు తెగ వైరల్ అవుతున్నాయి. వర్మ కు కౌంటర్ గా చంద్రోదయం చిత్ర యూనిట్ ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది. ఏపి ఎలక్షన్స్ లో సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో గాని సినిమాల వల్ల సోషల్ మీడియాలో అభిమానుల మధ్య గొడవలు సీరియస్ గా మారుతున్నాయి.
ఇటీవల వర్మ రిలీజ్ చేసిన వెన్ను పోటు సాంగ్ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఆ పాటకు కౌంటర్ గా చంద్రోదయం టీమ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. వెన్నుపోటు అని వాగే వాజెమ్మలు..అంటూ మొదలయ్యే ఈ పాటను దర్శకుడు వెంకట రమణ రచించగా షారుక్ సంగీతాన్ని అందించారు. ప్రతి లైన్ లో చంద్రబాబు పై విమర్శలు చేసే వారికి కౌంటర్ పడే విధంగా పాటను రాశారు.
"ఆకులు ఎన్ని కాల్చినా.. బొగ్గులు కావు బ్రదర్. జిత్తులమారి నక్కలు, తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే’’ అంటూ ఎన్టీఆర్ పడినట్లుగా విజువల్స్ వేసి వీడియో రిలీజ్ చేశారు. చంద్రబాబు బయోపిక్ చంద్రోదయం సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు వెంకటరమణ తెలిపారు.
చంద్రబాబు బాల్యం నుంచి రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాలను అలాగే ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించనున్నారట. చంద్రబాబు దేశంలోనే గొప్ప నాయకుడని నారావారి పల్లె, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ వంటి లొకేషన్స్ లో షూటింగ్ జరిపినట్లు దర్శకుడు తెలియజేశాడు. మరి ఈ సాంగ్ పై వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 10, 2019, 9:55 PM IST