లక్కీ హీరోయిన్ రష్మిక మందానకు జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాదిలో ఆమెకు తొలి ప్లాప్ పడింది. ఆడవాళ్లు మీకు జోహార్లు ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు ఈ చిత్రాన్ని ప్లాప్ అకౌంట్ లో వేసేస్తున్నారు.
కన్నడ భామ రష్మిక (Rashmika Mandanna)టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఆమె ఇంత త్వరగా ఎదగడానికి కారణం హిట్ పర్సెంటేజ్. తెలుగులో రష్మిక మొదటి చిత్రం ఛలో. 2018లో విడుదలైన ఈ మూవీ ఊహించని విజయం అందుకుంది. అదే ఏడాది విజయ్ దేవరకొండకు జంటగా నటించే ఛాన్స్ దక్కించుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం వంద కోట్ల వసూళ్ళను అందుకొని ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది.
రష్మిక తెలుగులో నటించిన చిత్రాలలో డియర్ కామ్రేడ్ మాత్రమే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక రష్మిక గత మూడు చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు (Sariler Nekevvaru)మూవీలో రష్మిక మహేష్ (Mahesh babu)కి జంటగా నటించారు. అదే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలైన భీష్మ చిత్రంతో మరో విజయం ఖాతాలో వేసుకుంది. కరోనా ఇయర్ గా మిలిగిపోయిన 2020లో కూడా రష్మిక రెండు భారీ విజయాలు సాధించింది.
ఇక 2021 చివర్లో విడుదలైన పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). ఈ మూవీ దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ వర్షన్ వంద కోట్ల వసూళ్లు సాధించి అద్భుత విజయం అందుకుంది. తెలుగు వరకు చూస్తే సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేసింది. అయితే 2022 ప్రారంభంలోనే ఆమెకు ప్లాప్ ఎదురైంది. శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ చిత్ర ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu meeku joharlu) వసూళ్లు చూసిన ట్రేడ్ వర్గాలు ఈ మూవీ పుంజుకోవడం కష్టం అంటున్నారు. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో జోరుమీదున్న రష్మికకు బ్రేక్ పడినట్లయింది. ఈ చిత్ర పరాజయం శర్వానంద్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కలదు. ఆయనకు వరుసగా ఇది ఆరో ప్లాప్. ఓ టూటైర్ హీరోకి ఇన్ని ప్లాప్స్ అంటే నిలదొక్కుకోవడం కష్టం. అదృష్టదేవతగా పేరున్న రష్మిక సైతం శర్వానంద్ ఫేట్ మార్చలేకపోవడం దురదృష్టకరం.
ఇక త్వరలో పుష్ప 2 షూట్ లో జాయిన్ కావాల్సిన రష్మిక... హిందీలో చేస్తున్న మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల షూటింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం రష్మిక ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే, మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల విజయం ఆమె కెరీర్ ని అక్కడ డిసైడ్ చేసే అవకాశం కలదు. ఎటూ పుష్ప విజయం బాలీవుడ్ లో ఆమె తొలి అడుగు సక్సెస్ అయినట్లే.
