కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ తెరకెక్కిస్తున్నారు. కాగా చిరు బర్త్ డే పురస్కరించుకొని లూసిఫర్ తెలుగు రీమేక్ టైటిల్ ప్రకటించారు. గాడ్ ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేయగా, చిరు ప్రీ లుక్ కేక పుట్టిస్తుంది.
మెగా ఫ్యాన్స్ చిరు బర్త్ డే వేడుకల్లో మునిగిపోగా, వరుస అప్డేట్స్ వాళ్ళ సంబరాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఆగష్టు 22 చిరంజీవి బర్త్ డే కాగా, ఒకరోజు ముందే చిరు నుండి క్రేజీ అప్డేట్స్ రావడం జరిగింది. చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రకటన చేశారు. అలాగే సెట్స్ పై ఉన్న లూసిఫర్ తెలుగు రీమేక్ టైటిల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ ని చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ తెరకెక్కిస్తున్నారు. కాగా చిరు బర్త్ డే పురస్కరించుకొని లూసిఫర్ తెలుగు రీమేక్ టైటిల్ ప్రకటించారు. గాడ్ ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేయగా, చిరు ప్రీ లుక్ కేక పుట్టిస్తుంది. లాంగ్ కోట్, హాట్ ధరించి చేతిలో పిస్టల్ తో చిరు గ్యాంగ్ స్టర్ పోలిన లుక్ లో దర్శనం ఇచ్చారు.
ఇక గతంలో లూసిఫర్ రీమేక్ టైటిల్ గాడ్ ఫాదర్ గా నిర్ణయించారని ప్రచారం జరిగింది. సదరు ప్రచారాలను రుజువు చేస్తూ నేడు, గాడ్ ఫాదర్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మరోవైపు దర్శకులు బాబీ, మెహర్ రమేష్ తెరకెక్కించనున్న చిత్రాలలో నటించనున్నట్లు అధికారిక ప్రకటన జరిగింది.
దర్శకుడు బాబీ, చిరు ప్రాజెక్టుపై రేపు సాయంత్రం అప్డేట్ రానుంది. ఇక చిరు-కొరటాల శివ క్రేజీ ప్రాజెక్ట్ ఆచార్య విడుదలకు సిద్ధం అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై రేపు స్పష్టత రానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చరణ్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయనకు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.
