సినిమా పరిశ్రమలో క్షణ క్షణానికి లెక్కలు మారిపోతూంటాయి. డెసిషన్స్ అంతకు రెట్టింపు వేగంగా తీసుకుంటూంటారు. ఈ రోజు ఉన్న వార్త రేపటికి నిజం కాదు...నిన్న అబద్దం అనుకున్నది ఈ రోజు హఠాత్తుగా నిజం అయ్యిపోతుంది. గత కొద్ది రోజులుగా చిరంజీవి చేయబోతున్న లూసిఫర్ చిత్రం రీమేక్ కు డైరక్టర్ ని ఎవరు తీసుకుందామనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. మొదట సుకుమార్‌ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆయన అల్లు అర్జున్‌ చిత్రంతో బిజీగా ఉండటంతో సుకుమార్‌ పేరు పక్కకు వెళ్లిపోయింది. ఆ తర్వాత సుజీత్ ని అనుకున్నారు. కానీ అతను పెళ్లి చేసుకోవటం, అతను చేసిన మార్పులు నచ్చకపోవటంతో వినాయిక్ సీన్ లోకి వచ్చారు. అయితే వినాయిక్ ఈ స్క్రిప్టు కు సూచించిన మార్పులు నచ్చకపోవటంతో మళ్లీ ఈ రీమేక్ తమిళ దర్శకుడు మోహన్ రాజా వార్తల్లోకి వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ సుజీత్ దగ్గరకే వచ్చి ఆగినట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. తెలుగు జనం కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడట. కాగా సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారు. అలాగే సాయి మాధవ్ తో పాటు ఆకుల శివ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.  ఇక ‘లూసిఫర్’లో మంజు వారియర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఇక సుజీత్ విషయానికి వస్తే శర్వానంద్ హీరోగా ..ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సుజీత్ ..  ప్ర‌భాస్ హీరోగా సాహో అనే చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌క‌పోయిన హిందీలో మాత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ డైరెక్ట‌ర్‌కి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది.  

అలాగే ఈ చిత్రంలో  చిరంజీవి పాత్రకు రెండు పేర్లు ఉండబోతున్నాయి. అందులో ఒకటి రాయలసీమకు సంబంధించిన పాత్ర అని ,ఈ క్యారెక్టర్‌కు బైరెడ్డి అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇదే పేరు టైటిల్‌గా కూడా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బై రెడ్డి టైటిల్ తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితమే. అందుకే చిరంజీవి కూడా ఇదే టైటిల్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎంటర్ టైనర్‌గా లూసిఫర్ సినిమాను తెరకెక్కించాడు పృథ్వీరాజ్ సుకుమారన్.