టాలీవుడ్ చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లలో కాజల్ కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆమెను నమ్ముకొని ఇప్పుడు నలుగురు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

సీత సినిమాలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాతో ముడిపడి ఉన్న వారందరికీ హిట్టు తప్పనిసరిగా అవసరం. సీత పై ప్రస్తుతం ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు. దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్టందుకున్నా ఈ సినిమాకు ఆయన క్రేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. 

ఇక హీరో స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హిట్టు కోసం కష్టపడటమే సరిపోతోంది. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మళ్ళీ కెరీర్ లో డౌన్ కి వెళ్ళిపోతున్నాడు. నిర్మాత అనిల్ సుంకర వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఇలా అందరు సీత సక్సెస్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. 

అయితే సినిమాకు కాజల్ గ్లామరే ఇప్పుడు ప్రధానంగా మారింది. ఆమెకోసం థియేటర్ కి వచ్చేవారి సంఖ్య బాగానే ఉంది. దీంతో కాజల్ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండాలని ట్రైలర్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి సీతకు కాజల్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.