Asianet News TeluguAsianet News Telugu

షాక్ ... 'లవ్ టుడే' ఓటిటి రిలీజ్..వచ్చే వారమే

రిలీజ్ రోజు శుక్ర‌వారం ఒక్క‌రోజు దాదాపు రెండు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం రోజు కూడా కోటికిపైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఆదివారం కూడా కలెక్షన్స్ బాగున్నాయి. 

LoveToday OTT release on 2nd Dec
Author
First Published Nov 28, 2022, 12:52 PM IST


 ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడిగా చేసిన తమిళ చిత్రం 'లవ్ టుడే'. ఇదే పేరుతో ఈ మూవీని తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు. తమిళంలో ఇప్పటికే రూ.50 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ మూవీ తెలుగులో మెల్లిగా మొదలై భాక్సాఫీస్ దగ్గర పెద్దగా మారి దండయాత్ర మొదలు పెట్టింది. తమిళంలొ ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేశారు. తెలుగులో మాత్రం నవంబర్ 25 న రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు అనుకోని ట్విస్ట్ పడింది.
 
 ల‌వ్ టుడే సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆదివారం రివీల్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబ‌ర్ 2 నుంచి ల‌వ్ టుడే స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు లాంగ్వేజ్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఈ వార్త తో  తెలుగులో కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

రిలీజ్ రోజు శుక్ర‌వారం ఒక్క‌రోజు దాదాపు రెండు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం రోజు కూడా కోటికిపైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఆదివారం కూడా కలెక్షన్స్ బాగున్నాయి. ఇలా వ‌సూళ్లు రోజురోజుకు పెరుగుతోన్న త‌రుణంలో ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ దిల్‌రాజుకు షాక్ ఇచ్చింది. సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్స్ త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.
 
అనుమానం ఉన్న‌చోట ప్రేమ  పుట్టదనే పాయింట్‌తో ఫ‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో ఉత్త‌మ‌న్ ప్ర‌దీప్ అనే పాత్ర‌లో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ క‌నిపించ‌గా నిఖిత‌గా ఇవానా న‌టించింది. ఒక‌రి గురించి మ‌రొక‌రికి పూర్తిగా తెలుసునే ఆలోచనలో ఉన్న  ఓ యువ‌ జంట పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. కానీ ఒక‌రి ఫోన్‌ను మ‌రొక‌రు ఒక రోజు మార్చుకోవాల‌ని హీరోయిన్ తండ్రి పెట్టిన కండీష‌న్ వ‌ల్ల వారి పర్శనల్ సీక్రెట్స్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాయి? ఈ కండీష‌న్ వ‌ల్ల వారు విడిపోయే ప‌రిస్థితి ఎలా వ‌చ్చింద‌నేది కామెడీ, ఎమోష‌న్స్‌తో ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరు జనాలకు బాగా నచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios