రాజ్ తరుణ్ లవర్ ని చూశారా?

lover movie teaser released
Highlights

ఈ మధ్యకాలంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కి సరైన విజయాలు లభించక డీలా పడ్డాడు

ఈ మధ్యకాలంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కి సరైన విజయాలు లభించక డీలా పడ్డాడు. రీసెంట్ గా విడుదలైన 'రాజుగాడు' సినిమా కూడా సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం అందుకోవాలనే తపనతో ఉన్నాడు.

ఈ క్రమంలో అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న 'లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ను బట్టి ఇదొక సింపుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో రాజ్ తరుణ్ గెటప్ కూడా బాగానే ఉంది. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఈసారైనా రాజ్ తరుణ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి! 

 

loader