'లవ్ టుడే' తెలుగు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం యువత ఎలా ఉందో.. ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో లవ్ టుడే సినిమా ద్వారా చూపించారు. ఇప్పుడీ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మితమైన తమిళ చిత్రం లవ్ టుడే సినిమా అరవై కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డబ్ చేశారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్.
ఈ మూవీ తెలుగులో మెల్లిగా మొదలై భాక్సాఫీస్ దగ్గర పెద్దగా మారి దండయాత్ర మొదలు పెట్టింది. ఈ లోగా తమిళ ఓటిటి వెర్షన్ రిలీజ్ చేసారు. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటిటి కు రిలీజ్ కు రెడీ అయ్యింది. అందుతున్న సమాచారం మేరకు క్రిస్మస్ కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 25 నుంచి లవ్ టుడే స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వార్త తో తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తున్న వారికి పండగే అని చెప్పాలి.
అనుమానం ఉన్నచోట ప్రేమ పుట్టదనే పాయింట్‌తో ఫన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో ఉత్తమన్ ప్రదీప్ అనే పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించగా నిఖితగా ఇవానా నటించింది. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసునే ఆలోచనలో ఉన్న ఓ యువ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఒకరి ఫోన్‌ను మరొకరు ఒక రోజు మార్చుకోవాలని హీరోయిన్ తండ్రి పెట్టిన కండీషన్ వల్ల వారి పర్శనల్ సీక్రెట్స్ ఎలా బయటపడ్డాయి? ఈ కండీషన్ వల్ల వారు విడిపోయే పరిస్థితి ఎలా వచ్చిందనేది కామెడీ, ఎమోషన్స్‌తో దర్శకుడు ఆవిష్కరించిన తీరు జనాలకు బాగా నచ్చింది.