Asianet News TeluguAsianet News Telugu

#LoveToday:"లవ్ టుడే" డైరక్టర్ నెక్ట్స్ తెలుగులోనే...అడ్వాన్స్ ఇచ్చారు

ఈ చిత్రం దర్శక,హీరో ప్రదీప్ తో సినిమా చేస్తే మంచి బిజినెస్ అవుతుందనే ఆలోచన ఓ నిర్మాతకు కలిగింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి నెక్ట్స్ ప్రాజెక్టుకు లాక్ చేసినట్లు సమాచారం. 

Love Today Pradeep Ranganathan is making his Telugu debut
Author
First Published Nov 26, 2022, 1:22 PM IST

టాలెంట్ ఎక్కడున్నా తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తూంటారు. అదే విధంగా మన నిర్మాతలు సైతం పర భాషా చిత్ర దర్శకులను ప్రోత్సహిస్తూంటారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కు తెలుగులో అవకాసం వచ్చిందని సమాచారం. 

2019లో "కోమలి" అనే సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్ మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూటాంట్ డైరెక్టర్ గా సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా ఇప్పుడు తానే హీరోగా స్వీయ దర్శకత్వంలో "లవ్ టుడే" అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. నవంబర్ 4 న తమిళ్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్ల దాకా వసూలు చేసింది.  

తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయ్యింది. అదే టైటిల్ తో లవ్ టుడే తెలుగు వెర్షన్ నిన్న శుక్రవారం అంటే నవంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. మరి తెలుగు రాష్ట్రాల్లోనూ  ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరోగా మాత్రమే కాక ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా కూడా సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దారు. చాలా వరకు కథ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రదీప్ సినిమాని చాలా ఆసక్తికరంగా మలిచిన విధానం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్తున్నారు. 

 సినిమా మొత్తం దాదాపు ఎంటర్టైన్మెంట్ తోనే నడుస్తుంది. మధ్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రదీప్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మంచి కామెడీ ఉన్న సన్నివేశాలను రాసుకున్నారు.  సినిమాలోని ప్రతి పాత్ర మరియు కథ ప్రేక్షకుల కు చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.  
 ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శక,హీరో ప్రదీప్ తో సినిమా చేస్తే మంచి బిజినెస్ అవుతుందనే ఆలోచన ఓ నిర్మాతకు కలిగింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి నెక్ట్స్ ప్రాజెక్టుకు లాక్ చేసినట్లు సమాచారం. 

 రామ్,బోయపాటి శ్రీనులతో చిత్రం చేస్తున్న చిట్టూరి శ్రీనివాసరావు ఈ దర్శకుడుతో తన తదుపరి చిత్రం నిమిత్తం అడ్వాన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ప్రదీప్ హీరోగా చేసే సినిమానా లేక వేరే హీరోతో చేసే సినిమాకు ఈ అడ్వాన్స్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. తమిళ,తెలుగులో రూపొందే  విధంగా ప్లాన్ చేస్తారని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios