దర్శకుడు శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ చిత్రం 'ఇండియన్ 2'. చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయట.

సాధారణంగా కమల్ హాసన్ సినిమాలంటే లిప్ లాక్స్ ఉంటూనే ఉంటాయి. అతడి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే హీరోయిన్లు ఎగిరి గంతేసినప్పటికీ లిప్ లాక్స్ సీన్స్ విషయంలో కాస్త టెన్షన్ పడుతుంటారు. కానీ కమల్ సినిమా వదులుకోకూడదని వాటికి కూడా ఓకే చెప్పేస్తుంటారు. ఇప్పుడు కాజల్ కూడా కమల్ తో లిప్ లాక్ కి రెడీ అయిపోయిందని  చెబుతున్నారు.

నిజానికి కాజల్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి అంగీకరించదు. తను నటించిన లిప్ లాక్ సన్నివేశాల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటిది 'ఇండియన్ 2' సినిమాకి మాత్రం మేకర్లు అడిగిన వెంటనే ఒప్పేసుకుందట. కథ ప్రకారం సినిమాలో లిప్ లాక్ అవసరం చాలా ఉందట.

ఆ సన్నివేశాలకు ఓకే అంటేనే అగ్రిమెంట్ చేసుకుందామని చిత్రబృందం అడిగితే.. కాజల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ తో పాటు మరో బ్యూటీ రకుల్ కూడా  కనిపించనుందని సమాచారం. ఈ ఇద్దరి భామలతో వెండితెరపై కమల్ ఎంత రచ్చ చేస్తారో చూడాలి!