Asianet News TeluguAsianet News Telugu

లైగర్ టీమ్ కి మరో షాక్... అక్కడ ఒకరోజు ఆలస్యంగా రిలీజ్!


లైగర్ విడుదల దగ్గరపడుతుండగా అనుకోని సమస్యలు చుట్టుముడుతున్నాయి. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైగర్ మూవీ ట్రెండ్ చేస్తున్నారు. అదే సమయంలో లైగర్ హిందీ వర్షన్ ఓ రోజు ఆలస్యంగా విడుదల కానుందట. 

liger hindi version release might delay by one day
Author
First Published Aug 20, 2022, 6:11 PM IST

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ బ్లడ్ అండ్ లైఫ్ పెట్టి లైగర్ తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి వచ్చిన లాభాలతో పాటు ఉన్నవన్నీ ఊడ్చి పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. లాక్ డౌన్ కారణంగా మూవీ ఆలస్యమైంది. దీంతో అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. ఆర్థికంగా అనేక ఇబ్బందులుపడ్డట్లు నిర్మాత ఛార్మి ఇటీవల తెలియజేశారు. ఇక దేశవ్యాప్తంగా లైగర్ పట్ల అంచనాలున్నాయి. పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు. 

అయితే లైగర్ చిత్రానికి అనుకోని సమస్యలు చుట్టుముడుతున్నాయి. హిందీ వెర్షన్ ఒకరోజు ఆలస్యంగా విడుదల కానున్నట్లు సమాచారం. ఆగస్టు 25న లైగర్ అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. నార్త్ ఇండియాలో మాత్రం ఒకరోజు ఆలస్యంగా అందుబాటులోకి రానుంది అంటున్నారు. ఇది ఒకరకంగా ప్రతికూల పరిణామమే. మూవీ టాక్ బయటకొచ్చాక హిందీ వర్షన్ ఓపెనింగ్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మూవీకి నెగిటివ్ టాక్ వస్తే మరింత డామేజ్ జరుగుతుంది. ఈ సమస్య నుండి లైగర్ టీమ్ ఎలా బయటపడతారో చూడాలి. 

మరోవైపు సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైగర్ మూవీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ కి చెందిన ఓ వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేపోటిజం కారణంగానే సుశాంత్ మరణించారని భావిస్తున్న నెటిజెన్స్ నుండి అలియా భట్, కరణ్ జోహార్, కరీనా కపూర్,  సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అనన్య పాండే తీవ్ర వ్యతిరేకత  ఎదుర్కొంటున్నారు. కరణ్ జోహార్ లైగర్ సహ నిర్మాత కాగా, అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. మరికొన్ని ఇతర కారణాలతో లైగర్ ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో లైగర్ కి సపోర్ట్ గా మరొక వర్గం రంగంలోకి దిగారు. ఐ సప్పోర్ట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ తో పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇటీవల లాల్ సింగ్ చడ్డా ను బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ నెగిటివ్ ప్రచారానికి తోడు ఆ చిత్రానికి బ్యాడ్ టాక్  రావడంతో  బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. ఈ క్రమంలో నెగిటివ్ ట్రెండ్స్ లైగర్ టీంని  భయపెడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios