నేడు జరగబోతున్న ఆస్కార్స్ వేడుక కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నారు.

నేడు జరగబోతున్న ఆస్కార్స్ వేడుక కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు ఫైనల్ నామినేషన్స్ లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి హాలీవుడ్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తోంది అంటే నాటు నాటు సాంగ్ ప్రభావం కూడా ఉంది. 

నాటు నాటు సాంగ్ వల్ల వెస్ట్రన్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరింతగా చేరువయ్యారు. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలుచుకుంది. దీనితో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ కూడా ఖాయం అంటూ చాలా మంది అంచనా వేస్తున్నారు. మరి ఆస్కార్స్ బరిలో నాటు నాటు సాంగ్ కి పోటీగా బరిలో ఉన్న పాటలు ఏంటో చూద్దాం. 

టాప్ గన్ మేవెరిక్ చిత్రం నుంచి 'హోల్డ్ మై హ్యాండ్'..టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ చిత్రం నుంచి 'అప్లాజ్'.. ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ అల్ ఎట్ వన్స్ చిత్రం నుంచి 'థిస్ ఈజ్ ఏ లైఫ్' .. బ్లాక్ పాంథర్ వాకండా ఫారెవర్ చిత్రం నుంచి 'లిఫ్ట్ మీ అప్' పాటలు నాటు నాటు సాంగ్ కి పోటీగా ఉన్నాయి. 

హాలీవుడ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం నాటు నాటు సాంగ్ కి 'లిఫ్ట్ మీ అప్' సాంగ్ బలమైన పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ పాప్ గాయని రిహన్నా ఈ సాంగ్ ని పాడారు. బ్రిజీగా ఉండే ఈ పాట హాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంటుంది. రిహన్నా ఎంతటి ప్రఖ్యాత గాయనో అందరికీ తెలిసిందే. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ లిఫ్ట్ మీ అప్ సాంగ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిహన్నాపై అభిమానం కూడా కలసి వస్తోందట. 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ నాటు నాటు , లిఫ్ట్ మీ అప్ మధ్య మాత్రమే ఉండబోతోందని అంటున్నారు. దీనితో నాటు నాటు సాంగ్ లిఫ్ట్ మీ అప్ ని అధికమించి ఆస్కార్ సాధిస్తుందా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ఉత్కంఠకి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. 

ఇదిలా ఉండగా నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నప్పుడు రిహన్నా ఆర్ఆర్ఆర్ టీంకి శుభాకాంక్షలు తెలిపిన విజువల్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె పాడిన పాటతోనే నాటు నాటు సాంగ్ పోటీ పడుతోంది. భారత కాలమానం మార్చి 13 తెల్లవారు జామున 5.30 గంటలకు ఆస్కార్స్ వేడుక ప్రారంభం కానుంది. 

నాటు నాటు చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్, రాంచరణ్ కళ్ళు చెదిరే విధంగా పర్ఫెక్ట్ సింక్ తో డ్యాన్స్ చేసి అలరించారు.