Asianet News TeluguAsianet News Telugu

Leo Day 1 Collections : ‘లియో’ బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్లు ఎంత?

విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబోలోని చిత్రం ‘లియో’ నిన్న గ్రాండ్ గా విడుదలైంది. మిక్డ్స్ టాక్ అందినా  బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్ములేపింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఓపెన్ ను ప్రారంభించింది. 
 

Leo  The Film Day 1 Box office Collections World wide  NSK
Author
First Published Oct 20, 2023, 5:48 PM IST

తమిళ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రెండోసారి తెరకెక్కిన చిత్రం Leo ; Bloody Sweet. నిన్న (అక్టోబర్ 19న) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. తమిళంతో పాటు ఇండియాలోని ఇతర ప్రధాన భాషల్లోనూ విడుదలైంది. అయితే  ఈసినిమా తొలిరోజు పాజిటివ్ టాక్ తోపాటు కాస్తా మిక్డ్స్  టాక్ ను కూడా సొంతం చేసుకుంది. ఏదేమైనా ‘లియో’ తొలిరోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయని తెలుస్తోంది. ట్రెడ్ వర్గాల అంచనా ప్రకారం సాలిడ్ మార్క్ రీచ్ అయ్యింది. 

ప్రపంచ వ్యాప్తంగా ‘లియో’ తొలిరోజ రూ.115.90 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లు రావడం ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో ఈసినిమాకే సాధ్యమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కబాళి’, ‘పఠాన్’ వంటి చిత్రాలనూ సైతం దాటేసింది. మొత్తానికి మొదటిరోజు కలెక్షన్లు అదిరిపోయాయి. తమిళనాడులో రూ.48 కోట్లు, తెలుగు స్టేట్స్ లో రూ.16 కోట్లు, కర్ణాటకలో రూ.14 కోట్లు. కేరళలో రూ.11 కోట్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇక రెండోరోజూ సినిమా వసూళ్లు అదే స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది.

కోలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం టాక్ కాస్తా మిక్డ్స్ గా ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం మోత మోగిస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. ప్రీ సెల్స్ లోనే 2 మిలియన్ మార్క్ చేరుకోవడం విశేషం. ఇలాగే కొనసాగితే ఫస్ట్ వీకెండ్ వరకే ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్లను అందుకోనుందని అంటున్నారు. ‘లియో’ను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు. సెవెన్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, డైరెక్టర్స్  గౌతమ్ మీనన్, మిస్కిన్ కీలక పాత్ర పోషించారు. త్రిష హీరోయన్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios