Asianet News TeluguAsianet News Telugu

#LEO వందకు పైగా థియేట‌ర్ల‌లో రీ-రిలీజ్

లియో సినిమాని తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్‌లలో రీ-రిలీజ్ చేనున్నారు నిర్మాతలు. రీ రి-లీజ్ కు  కారణం…

Leo Thalapathy Vijays Highest Grossing Movie To Re-Release In Tamil Nadu  jsp
Author
First Published Nov 18, 2023, 12:23 PM IST


ఇళయదళపతి విజయ్ తాజాగా  భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'లియో'తో అభిమానుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్​ మోడ్​లో వచ్చిన ఈ సినిమా  దసరా సందర్బంగా వారం క్రితం అంటే అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమా రిలీజ్ అయ్యాక తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా మిగిలిన ప్లేస్ లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విజయ్ ,లోకేష్ కనకరాజ్ అభిమానులని లియో సినిమా ఆనందపరిచినా..  రెగ్యులర్ సినీ గోయర్స్ ని  మాత్రం నిరుత్సాహపరిచింది. అయితేనేం కలెక్షన్స్ లో కుమ్మి పారేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌ను అధిగమించి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.

ఈ నేపధ్యంలో  లియో సినిమాని తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్‌లలో రీ-రిలీజ్ చేనున్నారు నిర్మాతలు. రీ రి-లీజ్ కు  కారణం… త‌మిళ‌నాడు బాక్సాఫీస్ వ‌ద్ద‌ మంచి వసూళ్లను సాధించగల మంచి సినిమాలు ఏమీ లేకపోవడమే అని తెలుస్తోంది. 5వ వారంలో కూడా లియో బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగించటమే అని తెలుస్తోంది.  

Leo Thalapathy Vijays Highest Grossing Movie To Re-Release In Tamil Nadu  jsp

ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంది లియో.
 

Follow Us:
Download App:
  • android
  • ios