లియో కథ విజయ్ దళపతిది కాదా..? లోకేష్ ఏ హీరో కోసం రాసుకున్నాడంటే..?
లియో సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈమూవీలో హీరోగా విజయ్ దళపతి ఫ్యాన్స్ నుఅలరించారు. అయితే ఈసినిమా కథ మాత్రం విజయ్ కోసం రాసింది కాదట. మరి ఏ హీరో కోసం లోకేష్ ఈ సినిమా కథను తాయారు చేశారు.

తమిళ ఇలయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లియో. రీసెంట్ గా తమిళంతో పాటు.. తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇటీవల పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్ తో దూసుకుపోతోంది. విజయ్ ఫ్యాన్స్ కు మంచి విజ్యూవల్ ట్రీట్ ఇచ్చింది ఈసినిమా. అయితే ఈమూవీకి సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది అది ఏంటంటేు..?
విజయ్ సినిమా కథ ఆయనకోసం తయారు చేసిందికాదట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వాస్తవానికి నేను 5 సంవత్సరాల క్రితం వేరే హీరోని దృష్టిలో పెట్టుకుని ఈ లియో కథను రాసుకున్నాను. కాని ఆ కాస్టింగ్ కార్యరూపం దాల్చలేదు. మాస్టర్‌లో విజయ్‌తో కలిసి పనిచేసిన తర్వాత, ఆయన నటనా సామర్థ్యాలను ఎలివేట్ చేయడానికి ఆయనతో కలిసి ఈ లియో సినిమా చేశాను అని అన్నారు లోకేష్.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. లియో క్యారెక్టర్ లో విజయ్ కంటే ముందు తాను అనుకున్న హీరో ఎవరనే సీక్రెట్ మాత్రం లోకేష్ చెప్పలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం ఈ విషయంలో ఓ హీరో పేరు మారు మొగుతోంది. లోకేష్ ఈ కథను లోకనాయకుడు కమల్ హాసన్ కోసం రాసుకున్నారని టాక్ ఉంది. ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించగా అనిరుద్ సంగీతం అందించారు.
అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు.. భారీ ఎత్తున కలెక్షన్స్ కూడా రాబట్టింది మూవీ. ఇక విజయోత్సాహంలో..సక్సెస్ సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారట టీమ్. సక్సెస్ మీట్ కోసం ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయని సమాచారం. కాని ఈ విషయంలో మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.