Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ కు షాకిస్తున్న #LEO కలెక్షన్స్

 హైదరాబాద్ లాంటి మల్టిప్లెక్స్ లు ఉన్న సిటీల్లో ఉదయం 8 గంటల షోలు నడుస్తున్నాయి.  ‘లియో’కు  స్క్రీన్లు, షోలు  తగ్గించలేదు.  ఆక్యుపెన్సీ కూడా బాగుంది.

LEO is climbing leaps with big numbers all over jsp
Author
First Published Oct 22, 2023, 8:35 AM IST

తమిళ స్టార్  విజయ్‌ హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  యాక్షన్ ఎంటర్‌టైనర్ లియో. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్‌’ మెప్పించగా, తాజాగా ‘లియో’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావటంతో ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లు లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌(ఎల్‌సీయూ)లో ఈ సినిమా భాగంగా ఉంటుందా? రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ గా చేసారా? అంటూ మొదలైన చర్చ ‘లియో’పై అంచనాలను పెంచింది. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా?  అంటే అందుకోలేదనే చెప్పాలి.  సంజయ్‌ దత్‌, అర్జున్‌, త్రిష లాంటి క్రేజీ కాస్టింగ్‌తో లియో సినిమాను రూపొందించిన ఈ సినిమా రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి...సినిమా డ్రాప్ అయ్యిందా వంటి విషయాలకు వస్తే...

వాస్తవానికి భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్ము రేపుతోంది. సినిమా బాగోలేదంటున్నా ఈ సినిమా వసూళ్లకు మాత్రం ఢోకా లేదు. సినిమాకు ముందు నుంచే హైప్ ఉంది కాబట్టి తొలి రోజు హాళ్లు నిండడంలో, భారీ వసూళ్లు వచ్చేసాయి. కానీ చిత్రంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా ప్రక్కన బాలయ్య భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఉన్నా.. రెండో రోజు , మూడో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీతో నడిచి షాకిచ్చింది ‘లియో’. చాలా  చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి.  `భగవంత్‌ కేసరి`, `టైగర్‌ నాగేశ్వరరావు`ల కంటే `లియో`కే ఎక్కువ షోస్‌ పడటం విశేషం. హైదరాబాద్ లాంటి మల్టిప్లెక్స్ లు ఉన్న సిటీల్లో ఉదయం 8 గంటల షోలు నడుస్తున్నాయి.  ‘లియో’కు  స్క్రీన్లు, షోలు  తగ్గించలేదు.  ఆక్యుపెన్సీ కూడా బాగుంది. ఇలాంటి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇలా కలెక్ట్ చేయటం మామూలు విషయం కాదు. 
 
 యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా అనిపించేలాగే ఉన్నా… లోకేష్ గత చిత్రాల్లో కనిపించిన ఎమోషనల్‌ కనెక్టవిటీ  ఈ సినిమాలో లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో ప్రక్క ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్‌ లో కనిపించబోతున్నారంటూ  వార్తలు వైరల్ అయ్యీయి. చిత్రయూనిట్ కూడా ఈ వార్తలను ఖండించలేదు. వచ్చే క్రేజ్ ని పోగొట్టుకోవటం ఎందుకనుకున్నారు. కానీ సినిమాలో చరణ్‌ కనిపించకపోవటంతో అభిమానులను  హర్ట్ చేసింది.   

ఇక  విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంటున్న లియో… ఆ తరువాత ఈ  జోరు ని ఏ మేరకు కొనసాగిస్తుందో చూడాలి.  
 
 

Follow Us:
Download App:
  • android
  • ios