ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు రామ్‌ లక్ష్మణ్‌ (78) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం నాగ్‌పూర్‌లో తుదిశ్వాస విడిచారు. దిగ్గజ సంగీత దర్శకుడు కన్నుమూయడంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. 

ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు రామ్‌ లక్ష్మణ్‌ (78) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం నాగ్‌పూర్‌లో తుదిశ్వాస విడిచారు. దిగ్గజ సంగీత దర్శకుడు కన్నుమూయడంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యింది. ​శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు అమర్‌ తెలిపాడు. కొన్నిరోజుల క్రితం రామ్‌ లక్ష్మణ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారని, ట్రీట్‌మెంట్‌ కొనసాగుతుండగానే గుండెపోటుతో చనిపోయినట్లు అమర్ మీడియాకు వెల్లడించాడు.

`మైనే ప్యార్‌ కీయా`, `హమ్‌ ఆప్‌కే కౌన్`‌, `హమ్‌ సాథ్‌ సాథ్‌ హై`, `100 డేస్‌` లాంటి సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ సినిమాలకు అత్యద్భుతమైన పాటలను అందించారు. రామ్‌ లక్ష్మణ్‌ పాటలు సినిమా విజయాల్లో కీలక భూమిక పోషించాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో మ్యూజికల్‌ హిట్స్ అందించారు. తొంభై దశకంలో అద్భుతమైన పాటలు అందించిన రామ్‌ లక్ష్మణ్‌ అసలు పేరు విజయ్‌ పాటిల్‌. సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌, ఇలా స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతం అందించారు. ఆయా చిత్రాల్లో సక్సెస్‌లో భాగమయ్యాయి. రామ్‌ లక్ష్మణ్‌ సంగీతం అందించారంటే సినిమా సక్సెసే అనేంతగా బాలీవుడ్‌లో ముద్ర పడింది. వినసొంపైన సంగీతం శ్రోతలను ఉర్రూతలూగించారాయన.

రాజ్‌శ్రీ ప్రొడక్షన్‌లో ఎక్కువ సినిమాలకు పనిచేశారు రామ్‌లక్ష్మణ్‌. 1975 నుంచి హిందీ, మరాఠీ, భోజ్‌పురిలో కలిపి మొత్తం డెబ్భై సినిమాలకు పని చేశారు. అయితే రామ్‌ లక్ష్మణ్‌ ఇద్దరూ వేర్వేరు. రామ్‌(సురేందర్‌), లక్ష్మణ్‌(విజయ్‌పాటిల్‌) ఇద్దరూ మొదట్లో కలిసి పనిచేశారు. 1977లో ఏజెంట్‌ వినోద్‌ సినిమా తర్వాత సురేందర్‌ చనిపోయారు. అప్పటి నుంచి విజయ్‌పాటిల్‌(లక్ష్మణ్‌) రామ్‌లక్ష్మణ్‌గానే కొనసాగుతూ వచ్చారు. 

రామ్‌ లక్ష్మణ్‌ మృతి పట్ల గానకోకిల లతా మంగేష్కర్‌ ట్విట్టర్‌లో సంతాపం తెలిపింది. ఆయన సంగీతంలో తాను పాడిన పాటలన్నీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని ఆమె గుర్తు చేసుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో `దీదీ తేరా దేవర్‌ దివానా`, `కబూతర్‌ జా జా` పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. 

Scroll to load tweet…