Asianet News TeluguAsianet News Telugu

లెజెండరీ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత!

అలనాటి లెజెండరీ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతి మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి 4 మధ్యాహ్నం మల్లాపూర్ లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 87ఏళ్ల హైమావతిగారు గుండెపోటుకు గురికావడంతో మరణించినట్లు తెలుస్తుంది. హైమావతి మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

legendary actor late kantharao wife hymavathi passes away ksr
Author
Hyderabad, First Published Feb 5, 2021, 12:38 PM IST

టాలీవుడ్ లో మరోవిషాదం చోటుచేసుకుంది. అలనాటి లెజెండరీ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతి మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి 4 మధ్యాహ్నం మల్లాపూర్ లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 87ఏళ్ల హైమావతిగారు గుండెపోటుకు గురికావడంతో మరణించినట్లు తెలుస్తుంది. హైమావతి మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. హైమావతి మృతి గురించి తెలుసుకున్న పలువురు చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. 

1940లో కాంతారావుగారు సుశీల అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. సుశీల అనారోగ్యంపాలు కావడంతో  1950లో హైమావతిని రెండో వివాహం చేసుకోవడం జరిగింది. వీరి వివాహం అనంతరం సుశీల మరణించారు. మొదటి భార్యకు పుట్టిన అబ్బాయి, అమ్మాయి కూడా మరణించడం జరిగింది. 

కాగా హైమావతి గారికి మొత్తం నలుగురు కుమారులు, ఒక కుమార్తె జన్మించడం జరిగింది. వీరిలో రాజా, సత్యం నటులుగా పలు చిత్రాలలో నటించారు. నేడు హైమావతి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేయనున్నారు. 2009లో కాంతారావుగారు క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios