ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఇంటర్నేషనల్ క్రేజ్ ఏర్పడింది.
ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఇంటర్నేషనల్ క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్. మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సినిమా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి ఇద్దరూ ఈ చిత్ర నిర్మాణంలో ఇన్వాల్వ్ అయ్యారు. తాజాగా ఛార్మి ఓ క్రేజీ న్యూస్ ప్రకటించింది.
లైగర్ చిత్రంలో తన పాత్రకు లెజెండ్ మైక్ టైసన్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలని ఛార్మి అభిమానులతో పంచుకుంది.
పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ గెటప్ ఈ చిత్రంలో డిఫెరెంట్ గా ఉండబోతోంది. విజయ్ కి జోడిగా ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే.
లైగర్ రిలీజ్ కాకముందే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో మరో చిత్రం షురూ చేశారు. పూరి డ్రీమ్ ప్రాజెక్టు జనగణమనలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
