కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ చిత్రం తాజాగా చిక్కుల్లో పడింది. మూవీలోని మ్యూజిక్ కాపీ చేశారంటూ ఓ సంస్థ ఆరోపిస్తోంది.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంతార’(Kantara). రచన, దర్శకత్వం కూడా రిషబ్ శెట్టినే వహించారు. ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై కేవలం రూ.16 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. గత నెల 31న కన్నడలో విడుదలై బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) డబ్ చేసి అక్టోబర్ 15న విడుదల చేశారు. అటు హిందీ, తమిళంలోనూ విడుదలై ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన స్పందనను దక్కిచుకుంది.

అయితే, బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన కాంతార చిత్రానికి కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కథలో చెప్పబడిన దేవుళ్లు హిందువు మతంలో భాగం కాదని చేతన్ అనే వ్యక్తి వివాదాస్పద ప్రకటన చేశాడు. దాన్ని ఖండిస్తూ ఆయనపై శివకుమార్ అనే వ్యక్తి శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇదిలా నడుస్తుండగానే మరో కొత్త చిక్కు వచ్చి పడింది. రీసెంట్ గా చిత్రం నుంచి విడుదలైన ‘వరాహ రూపం’ (Varaha Roopam) లిరికల్ వీడియో సాంగ్ తో సమస్య ఏర్పడింది. ఈ మ్యూజిక్ తమదేనని కన్నడకు చెందిన ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ‘తైక్కుడం బ్రిడ్జ్’ వారు ఆరోపించారు. 

గతంలోనే ఈ బ్యాండ్ లో ‘నవరసం’ ఆల్బమ్ వచ్చిందని తెలిపారు. దాన్ని కాపీ చేస్తూ ‘కాంతార’లో బాగాపాపులర్ అయిన ‘వరాహ రూపం’ సాంగ్ ఉందంటున్నారు. నవరసం, వరాహ రూం మ్యూజిక్ చాలా వరకు ఒకేవిధంగా ఉందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ మండిపడ్డారు. కాపీ చేయడానికి, సాంగ్ నుంచి ఇన్స్ఫిరేషన్ అవడానికి చాలా తేడా ఉందన్నారు. తర్వలోనే లీగల్ నోటీసులు కూడా పంపిస్తామని తెలిపారు. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. 

View post on Instagram