Asianet News TeluguAsianet News Telugu

నయనతార పైనా,నెట్ ప్లిక్స్ పైనా లీగల్ కేసు

ఈ చిత్రం లవ్ జిహాద్ ను బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి విమర్శించారు. అన్నపూర్ణి చిత్ర  నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

Legal Case filed against Nayanthara and Netflix Alleging Anti Hindu Activity jsp
Author
First Published Jan 9, 2024, 1:37 PM IST


  నయనతార నటించిన అన్నపూర్ణి చిత్రం గత కొన్నిరోజులుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. అయితే ఈ సినిమాలో రాముడ్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...

న‌య‌న‌తార అన్న‌పూర్ణి మూవీ డిసెంబ‌ర్ 29న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. థియేట‌ర్ల‌లో కేవ‌లం త‌మిళ భాష‌లోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌లైంది. థియేట‌ర్ల‌లో డిసెంబ‌ర్ 1న రిలీజైన ఈ మూవీ నెల రోజులు కూడా గ‌డ‌వ‌క ముందే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అయితే అన్నపూర్ణి చిత్రంలోని కొన్ని సీన్లు హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ చిత్రం లవ్ జిహాద్ ను బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి విమర్శించారు. అన్నపూర్ణి చిత్ర  నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

ఈ చిత్రంలో ఓ హిందూ పూజారి కుమార్తె నమాజు చదవడం, బిర్యానీ వండడం చూపించారని రమేశ్ సోలంకి వెల్లడించారు. ఇందులో ఫర్హాన్ (నటుడు) ఓ నటిని మాంసం తినాలని కోరతాడని, శ్రీరాముడు కూడా మాంసాహారేనని ఆమెతో చెబుతాడని వివరించారు.  త్వరలో అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరగనుండడంతో జీ స్టూడియోస్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రాన్ని తీసుకువచ్చాయని రమేశ్ సోలంకి ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో... నీలేశ్ కృష్ణ (అన్నపూర్ణి దర్శకుడు), జై (నటుడు), నయనతార, జతిన్ సేథీ (నాడ్ స్టూడియోస్), ఆర్.రవీంద్రన్ (ట్రైడెంట్ ఆర్ట్స్), పునీత్ గోయెంకా (జీ స్టూడియోస్), షరీఖ్ పటేల్, మోనికా షేర్ గిల్ (నెట్ ఫ్లిక్స్ ఇండియా)లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రమేశ్ సోలంకి పోలీసులను కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios