రావణాసుర మూవీ విడుదలకు సిద్ధం కాగా ఓ డైలాగ్ లీకైంది. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఆ డైలాగ్ వివాదాస్పదం అవుతుంది.
రావణాసురు మూవీలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. క్రైమ్స్ కి పాల్పడే క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నారు. టైటిల్ లోనే హీరో క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చారు. సీతను చెరబట్టిన రాక్షసుడిగా రావణాసురుడిని రామాయణంలో వర్ణించారు. రావణాసురు చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఈ క్రమంలో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. రావణాసుర చిత్రానికి సెన్సార్ సభ్యులు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవితేజ రావణాసుర మూవీలో ఎంత బీభత్సం చేయనున్నాడో.
శాంపిల్ గా రావణాసుర మూవీ నుండి చిన్న డైలాగ్ లీకైంది. మూవీలోని ఓ క్లిప్ వైరల్ గా మారింది. లీక్డ్ వీడియోలో రవితేజ 'కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది రా' అని ఒక అమ్మాయితో కోపంగా అంటాడు. ఈ డైలాగ్ ఆడవాళ్లను కించ పరిచే విధంగా ఉందని పలువురు అభ్యంతరం చెబుతున్నారు. సెన్సార్ సభ్యులు ఇలాంటి బూతు డైలాగ్ కి ఎందుకు కట్ చెప్పలేదంటున్నారు. సదరు డైలాగ్ సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
లీక్డ్ డైలాగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా నెటిజెన్స్ దర్శకుడితో పాటు హీరో రవితేజను ఏకిపారేస్తున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ రావణాసుర చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో దక్ష నాగార్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానియేల్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రావణాసుర ఓ బెంగాలీ మూవీ రీమేక్ అని ప్రచారం కాగా... దర్శకుడు సుధీర్ వర్మ ఖండించారు.
ఇక రవితేజ లేటెస్ట్ మూవీస్ ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేశాయి. రావణాసుర మూవీతో రవితేజ హ్యాట్రిక్ కొడతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకోగా రావణాసుర మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది.
