సినీ పరిశ్రమలోకి రావాలని చూస్తున్న ఎంతో మంది అమ్మాయిలు కమిట్ మెంట్ ఇస్తేనే ఛాన్స్ లేదంటే లేదు అనేవారు చాలా మంది ఉన్నారని విమర్శలు వినపడుతూనే ఉన్నాయి. ఆ మధ్యన ..అలాంటి వారికి తాను కూడా బలైయ్యానని తెలుగు పరిశ్రమలోనూ  ఇలాంటి  కామ పిశాచులు చాలా మంది ఉన్నారని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసింది. అంతేకాక  జూనియర్ ఆర్టిస్టులను పడక సుఖం కోసం వేధించే వారు టాలీవుడ్ లో ఉన్నారని..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు మీడియా ద్వారా  వివాదం లేవనెత్తారు.  అయితే ఇండస్ట్రీలో ఎంత మార్పు వచ్చిందో కానీ కమిట్మెంట్ అనే పాయింట్ ని బేస్ చేసుకుని ఇప్పుడో సినిమా మాత్రం తెలుగులో తెరకెక్కుతోంది.

యంగ్ డైరక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ టాపిక్ పై ఓ సినిమా చేస్తున్నారు.  ఈ విషయాన్ని ఖరారు చేస్తూ  `కమిట్ మెంట్` అంటూ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఎఫ్ 3 ప్రొడక్షన్స్ - ఫుట్ లూజ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న ఓ నిజం! అంటూ ట్యాగ్ లైన్  ని ఇచ్చారు. నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని పోస్టర్ పైన ముద్రించారు.

ఇక పోస్టర్ లో  ఓ బెడ్ .. దానిపై రెండు తలగడలు.. పక్కకు జరిగిన దుప్పటా.. ఆ పక్కనే  విప్పి పారేసిన బ్రా.. జీన్స్.. షూస్..  ఉన్నాయి. ఇదంతా చూస్తూంటే కాస్తంత పచ్చిగానే  ఈ కమిట్ మెంట్ ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. గతంలో లక్ష్మీకాంత్ చెన్నా ...హైదరాబాద్ నవాబ్స్- నిన్న నేడు రేపు- పరిచయం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.  అలాగే బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి ఛీఫ్ కో డైరక్టర్ గానూ పనిచేసారు.