అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి  యూపీ భామ లావణ్య త్రిపాఠి కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లయినా ఇంకా స్టార్ హీరోయిన్ గా అడ్జస్ట్ కాలేకపోతోంది. బేబీ ఇన్నేళ్లలో 15కి పైగా సినిమాల్లో నటించింది. అందులో ఆమెకు సక్సెస్ ఇచ్చినవి రెండే సినిమాలు. భలే భలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు తప్పితే లావణ్య మరో సక్సెస్ అందుకోలేదు. 

ఎన్ని సినిమాలు చేసినా ఎంత కష్టపడినా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. ఇక ఎన్నో ఆశలతో నిఖిల్ తో చేసిన అర్జున్ సురవరం అయినా సక్సెస్ అవుతుంది అందుకుంటే అసలు ఆ సినిమా రిలీజ్ కావడానికే చాలా ఇబ్బందులు పడుతోంది. అయితే ఎట్టకేలకు ఈ సొట్టబుగ్గల సుందరికి కోలీవుడ్ లో రెండు ఆఫర్స్ దక్కినట్లు సమాచారం. 

జయం రవి స్టార్ట్ చేయబోయే ఒక కొత్త సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక మరో స్టార్ హీరో సినిమాలో బేబీ సెకండ్ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు మాత్రం లావణ్యకు ఆఫర్స్ ఏమి లేవు. ఆమె నటించిన చివరి సినిమాలు అంతరిక్షం - ఇంటిలిజెంట్.. డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.