Asianet News TeluguAsianet News Telugu

#MissPerfect: లావణ్య త్రిపాఠి ‘మిస్ ఫర్ ఫెక్ట్’మినీ రివ్యూ

 మెగా కోడలు అయిన తర్వాత లావణ్యనుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ కావడంతో.. ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.

Lavanya Tripathi Miss Perfect OTT mini Review jsp
Author
First Published Feb 4, 2024, 2:47 PM IST | Last Updated Feb 4, 2024, 2:47 PM IST

మెగా కోడలు  లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం నటించిన తొలి వెబ్ సిరీస్ ‘మిస్ ఫర్ ఫెక్ట్’.లావణ్య త్రిపాఠి హీరోయిన్ కావటంతో ఈ సీరిస్ పై మంచి అంచనాలే ఉన్నాయి.  విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కీలక పాత్రలో నటించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసింది మిస్ ఫర్ ఫెక్ట్.  ఆ ఎక్సపెక్టేషన్స్ తగ్గ స్దాయిలో ఈ సీరిస్ ఉందా ..చూద్దాం.

స్టోరీ లైన్ గా చూస్తే ...కోవిడ్ కాలంలో జరిగే ఫన్ సీరిస్ ఇది. ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తూ ఉంటున్న లావణ్య రావు(లావణ్య త్రిపాఠి) ప్రతీ విషయంలోనూ ఫెరఫెక్ట్ గా ఉంటూంటుంది.  హైదరాబాద్ కు ఉద్యోగ నిమిత్తం లావణ్య వస్తుంది. ఇక్కడ తనకు ఓ సొంత ప్లాట్ ఉండటంతో అందులో దిగుతుంది. సరిగ్గా అదే సమయంలో లాక్ డౌన్ విధిస్తారు. ఎక్కడికి కదలలేని పరిస్దితి. దాంతో తమకు ఇక్కడే పరిచయమైన పనిమనిషి...  జ్యోతి (అభిజ్ఞ) ..తను పనికిరాలేకపోతున్నానని చెప్తుంది. అంతేకాకుండా... పక్కనే ఉండే రోహిత్(అభిజిత్)కు కూడా ఆ విషయం  చెప్పమని చెబుతుంది. దీంతో రోహిత్ రూమ్ కు వెళ్తుంది  లావణ్య. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ  విషయం చెప్పడానికి వెళ్లిన లావణ్యను ఇంకో  పనిమనిషి అని అతను అనుకుంటాడు. ఒకానొక సందర్భంలో తన పేరు లక్ష్మి అని లావణ్య అతనికి అబద్ధం చెబుతుంది. ఇక్కడే మరో ట్విస్ట్  తన పై అధికారిగా లావణ్య వచ్చిందనే విషయం లాక్ డౌన్ వలన రోహిత్ కి తెలియదు. తమ ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు రోహిత్ అని లావణ్యకు తెలియదు. ఇద్దరు మధ్యా మెల్లిమెల్లిగా ప్రేమ చిగురిస్తుంది.  అప్పుడేమైంది.  రోహిత్-లావణ్యల పెళ్లి జరిగిందా? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

 లాక్ డౌన్ నేపథ్యంలో ఒక అపార్టుమెంటు పరిథిలో జరిగే కథగా దీన్ని దర్శకుడు తీర్చిదిద్దాడు. లాక్ డౌన్ అన్నారు కాబట్టి ముఖ్యమైన అరడజను పాత్రలు మినహా అపార్టుమెంటు వాసులెవరూ కనిపించరు.  కాబట్టి సీన్స్ అన్నీ వీళ్ల మధ్యే జరుగుతూంటాయి.  ఎలాంటి అడల్ట్ సీన్స్, బూతులు లేకుండా వచ్చిన  వెబ్ సిరీస్ కావటంతో ఫ్యామిలీలు ఆసక్తి చూపించే అవకాసం ఉంది. అయితే ఈ సీరిస్ కు మైనస్ పాయింట్ ఏమిటంటే స్లోగా నడవటం.  మొత్తం 8 ఎపిసోడ్స్ లో .. ఐదో ఎపిసోడ్ వరకూ కథ,కథనం లో అలా వెళ్తూనే ఉంటాయి. సీన్స్ తర్వాత సీన్స్ ..పెద్దగా కాంప్లిక్స్ ఎస్టాబ్లిష్ కాదు.   5వ ఎపిసోడ్ నుంచి కథలో కాస్త కదలిక మొదలవుతుందనే చెప్పాలి. 6వ ఎపిసోడ్ లో ఫన్ బాగుంది.  

టైక్నికల్ గా చూస్తే..ఈ సీరిస్ కు మంచి మార్కులు పడతాయి. ప్రశాంత్ ఆర్. విహారి  నేపధ్య సంగీతం ఇంపాక్ట్ ఫుల్ గా ఇచ్చాడు. ముఖ్యంగా ఫన్,లవ్  సీక్వెన్స్ లలో చేసిన బీజీఎం అదిరింది.  కెమరాపనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ ప్రేక్షకుడిని మంచి ఫీల్ కు తీసుకెళ్ళాయి.  ప్రొడక్షన్ డిజైన్ బావుంది.  డైరక్టర్ లిమిటెడ్ పాత్రలతో చేసిన ఈ సీరిస్  ఇంట్రస్టింగే. కాకపోతే స్క్రిప్టే కాస్తంత జాగ్రత్తగా చేస్తే బాగుండేది.   రవితేజ గిరజాల ఎడిటింగ్ బాగానే ఉంది.
  
నటీనటుల్లో ...మెగా కోడులు లావణ్య త్రిపాఠికు వంకపెట్టేందుకు ఏమీ లేదు.  రోహిత్ పాత్రలో అభిజీత్ మెప్పించాడు. జ్యోతి పాత్ర చేసిన అమ్మాయి గుర్తుండిపోతుంది. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.  

నటినటులు:లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్ , సునైనా, మహేశ్ విట్టా
సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ:ఆదిత్య జవ్వాది
దర్శకత్వం:విశ్వక్ ఖండేరావు
నిర్మాత:సుప్రియ యార్లగడ్డ
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios