బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్ప్రతిలో జనవరి 8న చేరిన లతా మంగేష్కర్ ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. తాజాగా డాక్టర్లు హెల్త్ అప్డేట్ అందించారు.   

ప్రముఖ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ గారికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇంకా ఆస్ప్రతిలోనే చికిత్స పొందుతోంది. తొలుత ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ ICUలో చేర్చి చికిత్స అందించారు. దాదాపు నెల రోజుల పాటు లతా మంగేష్కర్ ఇంకా ఆస్ప్రతిలోనే చికిత్స పొందుతున్నారు. దీంతో ఇటు సినీ ప్రముఖులు, అటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లతా మళ్లీ మామూలు స్థితికి చేరుకోవాలని కోరుతున్నారు. ఇటీవల ఒక ఆటో డ్రైవర్ కూడా తన సంపాదనను ఆమె చికిత్స కోసం అందించిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

నెల రోజులు గా బ్రీచ్ కాండీ ఆస్ప్రతి వైద్యులు లతా మంగేష్కర్ కు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందుస్తున్నారు. మొన్నటి వరకు ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా.. ప్రస్తుతం మళ్లీ క్షీణిస్తోందని బ్రీచ్ కాండీ ఆస్ప్రతి డాక్టర్ ప్రతిత్ సమ్దాని వెల్లడించారు. ‘జనవరి 8న లతా మంగేష్కర్‌కు COVID-19 మరియు న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆమె చికిత్సనిమిత్తం చేరారు. ప్రస్తుతం గాయని ఆరోగ్యం క్షీణించింది. ఆమెను మళ్లీ వెంటిలేటర్ సపోర్టుపై ఉంచాం’ అని డాక్టర్ ప్రతీత్ సమ్దానీ పేర్కొన్నారు.

కరోనా థర్డ్ వేవ్ మాత్రం సిని ఫీల్డ్ లో కొనసాగుతున్న వారికి ప్రమాదకరంగా మారింది. వేవ్ స్టార్ అవుతున్న సమయం నుంచి ఇప్పటి వరకు రోజుకు ఎవరో ఒక సెలెబ్రెటీ కరోనాకు గురవుతూనే ఉన్నారు. Omicron వేరియంట్ మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో ఇక ప్రముఖ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కూడా కోవిడ్ బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం దేవున్ని ప్రార్థిస్తోంది.