ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ లొ మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ చెప్పిన విదానం న‌చ్చి చాలా గ్యాప్ త‌రువాత మమ్మూట్టి ఈ తెలుగు లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న లభించింది. 

మమ్మూట్టి తెలుగు లో చాలా కాలం త‌రువాత న‌టించ‌డం విశేషం. ఈ చిత్రాన్ని జూన్ 20 నుండి సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ లాంగ్ షెడ్యూల్ లో చిత్రీక‌రిస్తున్నారు.  2003 లో డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పేద వాళ్ళ క‌ష్టాల్ని స్వ‌యంగా తెలుసుకోవ‌టానికి క‌డ‌ప దాటి వ‌స్తున్నా.. మీ గ‌డ‌ప క‌ష్టాలు విన‌టానికి అనే నినాదంతొ ఆయ‌న యాత్ర ఎలా స్టార్టు చేశారో.. ఇప్పుడు ఈ యాత్ర చిత్రం కూడా అదే విధంగా నాన్ స్టాప్ షెడ్యూల్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రిలో ఇదే లాంగెస్ట్ షెడ్యూల్ గా కూడా చెప్ప‌వ‌చ్చు. 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై వ‌స్తున్న చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ వుంది ఆడియ‌న్స్ లో మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ వున్నాయి. ఆ అంచనాలకు ఈ సినిమా తప్పకుండా రీచ్ అవుతుందనే నమ్మకంతో దర్శకనిర్మాతలు ఉన్నారు.