జయాపజయాలతో సంబంధం లేకుండా కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విక్రమ్. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద విక్రమ్ పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న విక్రమ్ అపరిచితుడు తరువాత పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాడు. 

అయితే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక భారీ బడ్జెట్ సినిమాతో రెడీ అవుతున్నాడు.  యునైటెడ్ ఫిలిమ్స్ కింగ్ డమ్ అనే ప్రొడక్షన్ హౌస్ లో మహావీర్ కర్ణ అనే చారిత్రాత్మక సినిమాలో విక్రమ్ కర్ణుడిగా కనిపించబోతున్నాడు. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే సినిమాకు సంబందించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా టీజర్ ను మరికొన్ని వారాల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన పనుల్లో దర్శకుడు విమల్ బిజీగా ఉన్నాడు. తెలుగు తమిళ్ లో ఒకేసారి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాతో విక్రమ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.