బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తరువాత డిఫరెంట్ సినిమాలంటూ బాగానే హడావుడి చేశాడు. భూమి - కళంక్ సినిమాలు విడుదల కాకముందు నుంచే ఎన్నో అంచనాలు పెరిగాయి. విడుదల తరువాత మాత్రం ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. 

ఇక ఇప్పుడు ప్రస్థానం సినిమాతో తన సత్తా చాటాలని కష్టపడుతున్నాడు. యాక్టింగ్ కి ఎమోషనల్ డ్రామాకి మంచి స్కోప్ ఉన్న ప్రస్థానం కథను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కథ ఒరిజినల్ దర్శకుడైన దేవకట్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సంజయ్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాడు. అయితే నేడు సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. 

పోస్టర్ లో సినిమాలో నటిస్తున్న యాక్టర్స్ మాత్రమే కనిపిస్తున్నారు కానీ స్పెషల్ గా ఏమి లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మనిషా కొయిరాలా - జాకీ ష్రాఫ్ - చుంకి పాండే - అలీ ఫజల్ వంటి స్టార్స్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్థానం సినిమా తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో సినిమా బాలీవుడ్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.